BBC Documentary: మోదీపై బీబీసీ డాక్యూమెంటరీ.. పోలీస్ కేసు ఫైల్ చేసిన సుప్రీం లాయర్

దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఇప్పటికే దీనిని తొలగించారు. భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికిపైగా గల భారతీయుల మనసును బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు. ఇక నెటిజెన్లు సైతం బీబీసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

BBC Documentary: మోదీపై బీబీసీ డాక్యూమెంటరీ.. పోలీస్ కేసు ఫైల్ చేసిన సుప్రీం లాయర్

SC lawyer files complaint against BBC over documentary on PM Modi

Updated On : January 20, 2023 / 8:39 PM IST

BBC Documentary: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బ్రిటన్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ (బీబీసీ) ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్‌ను అభ్యంతరకరంగా ఉందంటూ సుప్రీంకోర్టుకు చెందిన వినీత్ జిందాల్ అనే అడ్వకేట్ పోలీస్ కేసు ఫైల్ చేశారు. బీబీసీ ప్రసారం చేసిన ఆ డాక్యూమెంటరీని భారతదేశ సమగ్రతపై దాడిగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. మోదీని దేశ ప్రజలు ఎన్నకున్నారని, కానీ బీబీసీ ప్రసారం చేసిన డాక్యూమెంటరీలో హిందూ, ముస్లింల మధ్య విధ్వేషాలు ఉన్నట్లు చూపించారని విమర్శించారు. దీని వెనుక కుట్ర ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

Bharat Jodo Yatra: రాహుల్ వేసుకున్నది జాకెట్ కాదట, రెయిన్ కోటట

కాగా, ఈ డాక్యూమెంటరీపై భారత ప్రభుత్వం సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అపఖ్యాతిపాలు చేసే కథనాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేశారని దుయ్యబట్టింది. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని తీవ్రంగా విమర్శించింది. మోదీపై బీబీసీ రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది.

Brij Bhushan: ఎవరి దయాదాక్షిణ్యాలతో ఇక్కడ లేను.. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్

దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఇప్పటికే దీనిని తొలగించారు. భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికిపైగా గల భారతీయుల మనసును బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు. ఇక నెటిజెన్లు సైతం బీబీసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని సమర్థించే వారు కూడా ఉన్నారు. గోద్రా అల్లర్ల విషయంలో మోదీపై ఉన్న ఆరోపణలను ఆధారం చేసుకుని, బీబీసీ డాక్యూమెంటరీకి సానుకూలంగా స్పందిస్తున్నారు.