Viral Video: ఓరకంట చూపు.. చేతిలో రొట్టెలు.. మనసు దోచేస్తూ!

అమ్మాయే సన్నగా.. అరవనవ్వే నవ్వగా.. మతప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే.. ఈ పాట వింటే.. మనకు ఆడవారి చూపు.. నవ్వు ఎంతగా ఆకర్షిస్తుందో ఓ సినీ కవి ఇలా చెప్పకనే చెప్పాడు. ఈ పాటకు తగ్గట్లే ఓ యువతి ఇప్పుడు ఇంటర్నెట్ లో ఓరకంట చూపుతో రొట్టెలు చేస్తూ.. చిరునవ్వుతో కుర్రాళ్ళకి గిలిగింతలు పెడుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఈ చిన్నది రోటీలు చేసే ప్రతి వీడియో వైరలే.

Viral Video: ఓరకంట చూపు.. చేతిలో రొట్టెలు.. మనసు దోచేస్తూ!

Viral Video

Updated On : June 27, 2021 / 10:49 AM IST

Viral Video: అమ్మాయే సన్నగా.. అరవనవ్వే నవ్వగా.. మతప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే.. ఈ పాట వింటే.. మనకు ఆడవారి చూపు.. నవ్వు ఎంతగా ఆకర్షిస్తుందో ఓ సినీ కవి ఇలా చెప్పకనే చెప్పాడు. ఈ పాటకు తగ్గట్లే ఓ యువతి ఇప్పుడు ఇంటర్నెట్ లో ఓరకంట చూపుతో రొట్టెలు చేస్తూ.. చిరునవ్వుతో కుర్రాళ్ళకి గిలిగింతలు పెడుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఈ చిన్నది రోటీలు చేసే ప్రతి వీడియో వైరలే. సోషల్ మీడియా ప్రతి వీడియోకు లక్షలాది వ్యూస్.. వేలాది లైకులు.. రోజు రోజుకూ పెరుగుతున్న ఫాలోవర్లు.

 

View this post on Instagram

 

A post shared by @ekiya5


జాస్మిన్‌ సైని అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసే వీడియోలల కట్టెల పొయ్యి ముందు కూర్చుని.. చేతలతో చాలా అలవోకగా క్షణాల్లో రొట్టెలు చేస్తుంది. ఆరుబయట రోటీలు చేస్తూ ఓ సామాన్య పల్లెటూరులో తీసే ఈమె వీడియోలు మీరు చూస్తున్నంతసేపు యువతి ముఖం మీద నుంచి చూపు తిప్పుకోలేరు. తొలుత కుటుంబసభ్యుల కోసం ఆమె కూరగాయలు కట్ చేస్తుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె చిరుమందహాసానికి సోషల్ మీడియాలో ఊహించని రెస్పాన్స్ దక్కింది.

 

View this post on Instagram

 

A post shared by @ekiya5


దీంతో ఆమె చపాతీలు చేస్తున్న ఒక్కో వీడియోను ఎకియా 5 అనే ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తుండగా అవి వైరల్‌గా మారాయి. ఈమె చపాతీలు చేస్తూ చూసిన చూపుకు 11 లక్షలకు మందికిపైగా వీక్షించగా కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. కన్నుగీటతో ప్రియా వారియర్‌, పాకిస్థాన్ లో టీ అమ్ముకునే వ్యక్తి రాత్రికి రాత్రికే పెద్ద మోడల్, నీలి కళ్లు, అందమైన రూపం కలిగిన అర్షద్‌ ఖాన్‌ లాంటి వారిని రాత్రికి రాత్రి సోషల్‌ మీడియా సెలబ్రిటీలుగా మార్చేయగా ఇప్పుడు జాస్మిన్ షైనీ ఆ జావితాకు సిద్ధమైంది.

 

View this post on Instagram

 

A post shared by @ekiya5