Former Pope Benedict XVI: మాజీ పోప్ బెనెడిక్ట్ XVI ఇకలేరు.. అనారోగ్యంతో కన్నుమూత

మాజీ పోప్ బెనెడిక్ట్ XVI ఇకలేరు. 95 ఏళ్ల బెనెడిక్ట్ కొన్నేళ్లుగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నాడు. దాదాపు పదేళ్ల క్రితం ఆయన పోప్ హోదాకు రాజీనామా చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు (2005, ఏప్రిల్ 19 నుంచి 2013 ఫిబ్రవరి 28 వరకు) ఆయన పోప్ గా ఉన్నారు. గ్రెగొరీ XII 1415లో పోప్ హోదాకు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఆ హోదాకు రాజీనామా చేసిన మొదటి పోప్ గా బెనెడిక్ట్ XVI నిలిచారు.

Former Pope Benedict XVI: మాజీ పోప్ బెనెడిక్ట్ XVI ఇకలేరు.. అనారోగ్యంతో కన్నుమూత

Former Pope Benedict XVI

Updated On : December 31, 2022 / 4:33 PM IST

Former Pope Benedict XVI: మాజీ పోప్ బెనెడిక్ట్ XVI ఇకలేరు. 95 ఏళ్ల బెనెడిక్ట్ కొన్నేళ్లుగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. దాదాపు పదేళ్ల క్రితం ఆయన పోప్ హోదాకు రాజీనామా చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు (2005, ఏప్రిల్ 19 నుంచి 2013 ఫిబ్రవరి 28 వరకు) ఆయన పోప్ గా ఉన్నారు. గ్రెగొరీ XII 1415లో పోప్ హోదాకు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఆ హోదాకు రాజీనామా చేసిన మొదటి పోప్ గా బెనెడిక్ట్ XVI నిలిచారు.

బెనెడిక్ట్ XVI తన వాటికన్ నివాసంలో కన్నుమూశారని అక్కడి అధికారులు ఇవాళ ప్రకటన చేశారు. బెనెడిక్ట్ XVI పోప్ హోదాకు రాజీనామా చేసిన తర్వాతి నుంచి వాటికన్ హిల్ లోని మదర్ చర్చి మొనాస్టరీలో గడిపారు. ఆ ప్రాంతానికి తాను పలుసార్లు వెళ్లి బెనెడిక్ట్ ను కలిసి వచ్చానని ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు.

మాజీ పోప్ బెనెడిక్ట్ XVI మరణవార్తకు సంబంధించిన ఇతర వివరాలను వాటికన్ ఇంకా తెలపలేదు. జనవరి 2 నుంచి బెనెడిక్ట్ పార్థివదేహాన్ని సెయింట్ పీటర్స్ బసిలికాలో దర్శనానికి ఉంచుతామని ప్రకటించారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి వివరాలను మరికొన్ని గంటల్లో జరుపుతామని అన్నారు. జర్మనీలో 1927 ఏప్రిల్ 16న జన్మించిన బెనెడిక్ట్ XVI… 78 ఏళ్ల వయసులో పోప్ అయ్యారు. చాలా పెద్ద వయసులో పోప్ అయిన వారిలో బెనెడిక్ట్ ఒకరు.

Bihar Adulterated Liquor : బీహార్ లో కల్తీ మద్యం సేవించి 73 మంది మృతి.. కీలక నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు