డిసెంబర్ 2019 : Netflixలో చూడాల్సిన బెస్ట్ మూవీలు ఇవే

హాలీవుడ్ మూవీలంటే ఇష్టమా? హర్రర్, డ్రామా, థ్రిల్లర్ సినిమాలు చూడటం ఆసక్తా? ఇంకెందుకు ఆలస్యం వెంటనే నచ్చిన ఇంగ్లీష్ మూవీలను చూసి ఎంజాయ్ చేయండి. ఆన్‌లైన్ ఓటీటీ ప్లాట్ ఫాంపై స్ట్రీమింగ్ వీడియో కంటెంట్ అందించే ప్రపంచ OTT దిగ్గజం Netflixలో కొత్త మూవీలు రిలీజ్ చేసింది. డిసెంబర్ నెలతో 2019 సంవత్సరం ముగియబోతోంది. 2020 కొత్త సంవత్సరం రాబోతోంది.
క్రిస్మస్ పండుగకు ముందుగానే ఓటీటీ సబ్ స్ర్ర్కైబర్ల కోసం నెట్ ఫ్లిక్స్ ఎన్నో బెస్ట్ మూవీలను అందిస్తోంది. ఈ సీజన్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకునే వారంతా Netflixలో అందుబాటులో ఉన్న ఈ ఐదు బెస్ట్ అండ్ ఫ్యావరేట్ మూవీలను స్ట్రీమ్ అవ్వండి.
అందులో ఒకటి మ్యారేజ్ స్టోరీ, మాల్ కోలమ్ ఎక్స్, అస్టిన్ పవర్స్.. ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ మిస్టరీ, సెర్చింగ్ ఫర్ షుగర్ మ్యాన్, స్వీట్ వర్జీనియా వంటి ఇంగ్లీష్ మూవీల్లో నచ్చిన మూవీ చూడవచ్చు. ఒక్కో మూవీ గురించి సంక్షిప్తంగా చెప్పాలంటే..
1. Marriage Story :
ఇదో పెళ్లైన దంపతుల కథ.. మూవీలో డ్రామా, కామెడీ రెండూ బ్యాలెన్స్ చేశారు. కథ విషయానికి వస్తే.. ఇందులో స్టేజ్ డైర్టెక్టర్ అతడి భార్య ఎప్పుడు గొడవపడుతుంటారు. చివరికి ఇద్దరూ విడిపోయి డివర్స్ తీసుకునే వరకు వెళ్తారు. ఈ మూవీ డైరెక్టర్ నోహ్ బాయీమ్ బాచ్ 18 మిలియన్ల బడ్జెట్ తో ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.
నోహా్ కెరీర్ లో కూడా ఇదే బెస్ట్ ఫిల్మ్ కూడా. ఈ మూవీలో నటీనటులుగా స్కేర్ లెట్ జాన్సన్, అడామ్ డ్రైవర్, లౌరా డెర్న్, అలాన్ అల్డా, రాయి లియిట్టా, జులియె హ్యాగెర్టీ, మెరిట్ వివెర్ కీలక పాత్రల్లో మెప్పించారు.
2. Malcolm X :
ఇదో ఆటోబయోగ్రఫీ మూవీ. మాల్కమ్ ఎక్స్ ఇల్ -హజ్ మాలిక్ ఇల్-షాబాజ్.. అనే అమెరికన్ ముస్లిం మినిస్టర్ ఆత్మకథ ఆధారంగా తీసిన మూవీ. ఈయన అందరికి మాల్కమ్ ఎక్స్‌గా సుపరిచితుడు. మంత్రిగా మాత్రమే కాకుండా మానవ హక్కుల కార్యకర్త కూడా. పౌర హక్కుల ఉద్యమ సమయంలో మాల్కమ్ ఎక్స్ ఎంతో పాపులర్ అయ్యారు. 1990లో వచ్చిన బెస్ట్ మూవీల్లో ఇదొకటి.
మాల్కమ్ బయోపిక్ మూవీని న్యూయార్క్ ఫిల్మ్ మేకర్, రచయిత అయిన స్పైక్ లీ, అర్నోల్డ్ పెర్ల్ కథ రాసుకుని మూడున్నర గంటల నిడివితో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. తాను తీసిన బయోపిక్స్ మూవీల్లో బెస్ట్ బయోపిక్ ఇదొకటిగా చెప్పవచ్చు.
ఈ మూవీలో నటీనటులుగా డెన్జెల్ వాషింగ్టన్, అంగేలా బాసెట్, అల్బర్ట్ హాల్, అల్ ఫ్రీమ్యాన్ జెఆర్, డెల్రాయ్ లిండో, స్పైక్ లీ తమదైన నటనతో చక్కగా పాత్రల్లో ఒదిగిపోయారు.
3. Austin Powers: International Man of Mystery :
ఆస్టిన్ పవర్స్ సిరీస్ ల్లో ఇదొకటి. 1997లో గంటన్నర నిడివితో వచ్చిన ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ మిస్టరీ అనే ఈ క్రైమ్ అండ్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 1960 నుంచి 1997 వరకు వచ్చిన సిరీస్‌ల్లో మళ్లీ మళ్లీ చూడాలనిపించే మోడ్రాన్ ఫన్నీ మూవీగా చెప్పవచ్చు.
ప్రపంచ గ్రేట్ సీక్రెట్ ఏజెంట్ గా పాత్ర పోషించిన మైక్ మేయర్స్.. 1960లో బ్రిటన్ గూఢచారిగా సాహసాలను ఇందులో చూడవచ్చు. అంతరిక్షం నుంచి భూగ్రహంపై వచ్చిన డాక్టర్ ఈవిల్ గా మోడ్రాన్ లైఫ్ గురించి ఎన్నో విషయాలను నేర్చుకునే పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
నటుడిగా కాకుండా దర్శకుడిగానూ ఈ చిత్రాన్ని మైక్ మేయర్స్ ప్రాణం పోశారు. ఈ మూవీకి మైక్ మేయర్స్ దర్శకత్వం వహించగా.. ఎలిజిబెత్ హుర్లే, మిచెల్ యార్క్, మిమి రోజర్స్ ప్రధాన పాత్రల్లో నటించారు.
4. Searching for Sugar Man :
ఇదో డాక్యుమెంటరీ ఫిల్మ్.. మీరు డాక్యుమెంటరీ మూవీలంటే ఇష్టమైతే ఈ మూవీ చూడొచ్చు. డెరాయిట్ లో జన్మించిన మ్యూజిషియన్ సిక్స్టో రోడ్రిగ్విజ్ ఆకస్మాత్తుగా కనిపించకుండా పోతాడు. అతడు చనిపోయాడని వచ్చే రుమార్లను లెక్క చేయకుండా అతడి కోసం ఇద్దరు అభిమానులు వెతుకుతుంటారు.
సౌతాఫ్రికన్ మల్టీ ప్లాటీనమ్ మ్యూజికల్ లెజండ్ గా సిక్ట్సో ఎంతో పాపులర్ అవుతాడు. అతడి వెతికి పట్టుకునేందుకు స్టీపెన్ (షుగర్), సెజెర్మన్ వీరిద్దరి జర్నీ కొనసాగుతుంది. కాసేపు సస్పెన్స్ థ్రిల్లర్, సరదాగా సాగే ఈ మూవీ 2012లో రిలీజ్ కాగా, డైరెక్టర్ మాలిక్ బెండ్ జియోల్ అద్భుతంగా తెరకెక్కించారు.
5. Sweet Virginia :
2017లో రిలీజ్ అయిన స్వీట్ వర్జీనియా.. అమెరికన్ కెనడియన్ నియో నోయిర్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ. జామియే ఎం. డ్యాగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, బెంజామిన్ చైనా, పాల్ చైనా కథ రాశారు.
ఇందులో జాన్ బెర్నాథాల్, క్రిస్టోటాఫర్ అబాట్, ఇమోజెన్ పూట్స్, రోజ్ మ్యారీ డివిట్, ఒడెస్సా యంగ్, జరెడ్ అబ్రాహ్మాసన్ నటించారు. చిన్న టౌన్ లో జరిగిన హత్యకు సంబంధించి ఒక యువకుడు అతడి స్నేహితుల మధ్య జరిగే సన్నివేశాలను ఆసక్తికరంగా చిత్రీకరించారు.