Washington meet : జెలెన్స్కీకి బిడెన్ మద్దతు…సైనిక సహాయానికి భరోసా
యుక్రెయిన్ దేశానికి మరింత సైనిక సహాయానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భరోసా ఇచ్చారు. యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ వైట్ హౌస్ ఓవల్ కార్యాలయంలో ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడ్మిర్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు....

Biden assures Zelenskyy
Washington meet : యుక్రెయిన్ దేశానికి మరింత సైనిక సహాయానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భరోసా ఇచ్చారు. యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ వైట్ హౌస్ ఓవల్ కార్యాలయంలో ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడ్మిర్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు. రష్యన్ ఆక్రమణదారులను తిప్పికొట్టడానికి బిలియన్ల సాయం చేస్తామని బిడెన్ చెప్పారు.
Varanasi : రూ.451 కోట్లతో వరణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం…రేపు మోదీ శంకుస్థాపన
రష్యాతో సాగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ దేశానికి అమెరికా మద్ధతు ఇస్తోంది. (Biden assures Zelenskyy of support) ఆయుధాలు, వైమానికి రక్షణ కోసం 325 మిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీ ఇచ్చినందుకు జెలెన్స్కీ బిడెన్ కు కృతజ్ఞతలు తెలిపారు. రష్యన్ దిగ్బంధనం అనంతరం పొరుగున ఉన్న పోలాండ్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో యుక్రెయిన్ నుంచి ధాన్యం ఎగుమతిని విస్తరించడానికి బిడెన్ అంగీకరించారని జెలెన్స్కీ చెప్పారు.
వాషింగ్టన్ యుక్రెయిన్‌కు రెండవ రేథియాన్ నిర్మించిన హాక్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీ, సంబంధిత పరికరాలను కూడా పంపుతుందని బిడెన్ చెప్పారు. జెలెన్స్కీ యూఎస్ రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్, ఇతర సీనియర్ పెంటగాన్ నాయకులతో చర్చలు జరిపారు.