America in Afghanistan: మీ భవిష్యత్ మీరే తేల్చుకోండి – బైడెన్

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గురువారం అఫ్ఘన్లకు కీలక సూచనలిచ్చారు. ఆగష్టు 31లోగా అఫ్ఘన్లు వారి భవిష్యత్ ను వారే తేల్చుకోవాలని చెప్పారు. 'అఫ్తనిస్తాన్ ను ఉద్ధరించడానికి మరో 20ఏళ్ల ఖర్చుపెట్టలేం. అఫ్గన్ లీడర్లంతా కలసికట్టుగా ఉండి భవిష్యత్ గురించి ఆలోచించాలి' అని అన్నారు.

America in Afghanistan: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గురువారం అఫ్ఘన్లకు కీలక సూచనలిచ్చారు. ఆగష్టు 31లోగా అఫ్ఘన్లు వారి భవిష్యత్ ను వారే తేల్చుకోవాలని చెప్పారు. ‘అఫ్తనిస్తాన్ ను ఉద్ధరించడానికి మరో 20ఏళ్ల ఖర్చుపెట్టలేం. అఫ్గన్ లీడర్లంతా కలసికట్టుగా ఉండి భవిష్యత్ గురించి ఆలోచించాలి’ అని అన్నారు.

అఫ్గన్ లో యూఎస్ మిలటరీ ఆపరేషన్ ఆపేయడంపై బైడెన్ వివరణ ఇచ్చారు. ఆ దేశంలో తాలిబాన్ల కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదొక గెలుపులేని యుద్ధంగా ప్రకటించిన బైడెన్.. దీనికి మిలటరీ సొల్యూషన్ లేదని అభివర్ణించారు.

గవర్నమెంట్ ను డిఫెండ్ చేయడంలో తాలిబాన్లపై తనకు నమ్మకం లేదని ఆఫ్గన్ మిలటరీని విశ్వసిస్తున్నానని అన్నారు. ఆ స్పీచ్ కంటే ముందు వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ మాట్లాడుతూ.. హింస, గందరగోళం నుంచి విముక్తి వస్తుందని ఎదురుచూశాం. అమెరికా మిలటరీ ఇన్వాల్వ్‌మెంట్ పొడిగించాలని కూడా అనుకున్నాం. కాకపోతే మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆదేశానుసారం మే 2021 కల్లా అమెరికా బలగాలు విత్ డ్రా చేసుకుని వచ్చేసేట్లు ప్లాన్ చేస్తున్నాం. అని వివరించారు.

తాలిబాన్ తో డీల్ సెట్ చేసుకుని అఫ్గన్ గవర్నమెంట్ మాత్రమే ఆ దేశాన్ని పాలించాలి. ఒసామా బిన్ లాడెన్ ను పట్టుకోగలిగాం. కానీ, ప్రపంచం నుంచి టెర్రరిజాన్ని అంతమొందించలేకపోయాం అని బైడెన్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు