దూసుకుపోతున్న జో బైడెన్…వెనుకబడిన ట్రంప్

Biden Wins 10 States, Trump 8 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ముగిసింది. చాలా చోట్ల కౌంటింగ్ మొదలైంది. అమెరికా తూర్పు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇతర ప్రాంతాల్లో దక్షిణాదిన ఓటింగ్ కొనసాగుతోంది. వందేళ్లల్లో ఎన్నడూ లేనంతగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఈసారి, అధ్యక్ష ఎన్నికల పోలింగ్ తేదీ కంటే ముందే ఎర్లీ ఓటింగ్ ద్వారా 10కోట్లకు పైగా అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక ఫలితం కోసం ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అయితే, ఈసారి అమెరికా ఎన్నికల ఫలితం ఓటింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే తేలే అవకాశం లేదని తెలుస్తోంది. మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓటింగ్ భారీగా పెరగడం వల్ల వాటి లెక్కింపు అంత త్వరగా పూర్తయే సూచనలు కనిపించడం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన నిబంధనలు అమల్లో ఉండటం కూడా ఇందుకు మరో కారణం.
https://10tv.in/us-election-2020-over-59-million-votes-cast-but-wait-for-results-could-be-long/
ఇప్పటివరకు వెలువడిన పలితాలను బట్టి చూస్తే రిపబ్లికన్ పార్టీ నుంచి మరోసారి అధ్యక్షపదవికి పోటీ చేసిన ట్రంప్ వెనుకంజలో ఉన్నారు. ఇక డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికల బరిలో జో బైడెన్ ముందంజలో ఉన్నారు.
ఇప్పటివరకు విడుదలైన ఫలితాను చూస్తే…11 రాష్ట్రాల్లో జో బైడెన్,12 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు. వర్జీనియా, వెర్మాంట్, డిలావేర్, మేరీలాండ్, కనెక్టికట్,ఇల్లినాయిస్, మాసాచుసెట్స్, రోడీ ఐల్యాండ్,డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా,న్యూజెర్సీ,న్యూయార్క్ రాష్ట్రాలో జో బైడెన్ విజయం సాధించగా…టెన్నెసీ,వెస్ట్ వర్జీనియా, కెంటకీ, ఒక్లామా, ఇండియానా, సౌత్ కరోలినా,ఆర్కాన్ సాస్,ఆలబామా,మిస్సిసిపి రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు. ఇక,పెద్ద రాష్ట్రమైన ఫ్లోరిడాలో హోరా హోరీ కొనసాగుతోంది. ఫ్లోరిడాలో ట్రంప్ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక, ఇప్పటివరకు చూస్తే… ఎలక్ట్రోరల్ కాలేజి ఓట్లలో జో బైడెన్ ముందంజలో ఉన్నారు. ట్రంప్ వెనకబడ్డారు. జో బైడెన్ కు 131…ట్రంప్ కి 92 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి.