BillGates Divorce : 27ఏళ్ల తర్వాత విడిపోతున్న బిల్‌గేట్స్‌ దంపతులు

ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ సంచలన ప్రకటన చేశారు. బిల్‌గేట్స్‌ దంపతులు విడిపోతున్నారు. 27 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నారు.

BillGates Divorce : 27ఏళ్ల తర్వాత విడిపోతున్న బిల్‌గేట్స్‌ దంపతులు

Billgates And Melinda Gates Are Ending Their Marriage After 27 Years

Updated On : May 4, 2021 / 7:01 AM IST

BillGates Divorce : ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ సంచలన ప్రకటన చేశారు. బిల్‌గేట్స్‌ దంపతులు విడిపోతున్నారు. 27 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నారు. తాము విడిపోతున్నట్టుగా బిల్‌ గేట్స్‌ ట్వీట్‌ చేశారు. మెలిందాతో తన వివాహ బంధానికి ఇక ఫుల్‌స్టాప్‌ పెడుతున్నట్టుగా చెప్పారు.

27 ఏళ్ల తమ వివాహ బంధానికి ముగింపు పలకాలని ఇరువురు కలిసి నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. 27 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలకాలని తాము నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడిగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవటం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది.

గత 27 ఏళ్లలో తాము ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దామని.. దాంతోపాటు ప్రపంచలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా తమ ఫౌండేషన్‌ ద్వారా కృషి చేశామన్నారు. ఈ మిషన్‌లో తమ భాగస్వామ్యం ఎప్పటికీ కొనసాగుతుంది… కానీ భార్యాభర్తలుగా ఇక కొనసాగలేమని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బిల్‌గేట్స్‌ ఒకరు. గత ఫిబ్రవరి నాటికి ఆయన ఆస్తి 137 బిలియన్‌ డాలర్లు.

2000 సంవత్సరంలో స్థాపించిన బిల్‌-మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటివరకూ వారు 53 బిలియన్‌ డాలర్లను ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేశారు. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయసు 65 ఏళ్లు కాగా, మెలిందా వయసు 56 ఏళ్లు. మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి బిల్‌గేట్స్‌ సీఈవోగా ఉన్న సమయంలో మెలిందా ప్రొడక్ట్‌ మేనేజరుగా చేరారు.1994లో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు.