Syria : సిరియాలోని షియా ముస్లింల మందిరం సమీపంలో భారీ బాంబు పేలుడు..

ప్రవక్త మహమ్మద్ మనవరాలు, ఇమామ్ అలీ కుమార్తె అయిన సయీదా జీనాబ్ సమాధి నుండి 600 మీటర్ల దూరంలో ఉన్న భద్రతా భవనం సమీపంలో ఈ పేలుడు సంభవించిందని అధికారులుతెలిపారు.

bomb exploded in syria

Syria Bomb Exploded: సిరియా రాజధాని డమాస్కస్‌కు దక్షిణంగా ఉన్న షియా ముస్లిం మందిరం సమీపంలో అషురాకు ఒకరోజు ముందు బాంబు పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుడు ఘటనలో ఆరుగురు మరణించారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అధికారులు స్థానిక ఆస్పత్రులకు తరలించారు. అయితే, గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Kerala Road Accident : రోడ్డు దాటుతున్నారా? బీకేర్ ఫుల్.. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది.. ఒళ్లుగగుర్పొడిచే యాక్సిడెంట్ వీడియో

సిరియాలో అత్యధికంగా సందర్శించే షియా పుణ్యక్షేత్రమైన సయేదా జైనాబ్ సమాధి సమీపంలో ఈ బాంబు పేలుడు సంభవించింది. ఇది ఉగ్రవాద బాంబు దాడి అని సిరియా అధికారులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు టాక్సీలో బాంబు పెట్టడం వల్ల పేలుడు సంభవించిందని స్టేట్ టెలివిజన్ నివేదించింది. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం రావడంతో ప్రజలు పరుగులు పెట్టారని స్థానిక ప్రజలు తెలిపారు. వెంటనే అంబులెన్సులు వచ్చాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తంతరలించారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని స్థానికులు తెలిపారు.

500 Rupee Note : ఇలాంటి 500 రూపాయల నోట్లు ఫేక్..? ఇవి చెల్లవు? క్లారిటీ ఇచ్చిన కేంద్రం, అసలు నిజం ఇదే..

ప్రవక్త మహమ్మద్ మనవరాలు, ఇమామ్ అలీ కుమార్తె అయిన సయీదా జీనాబ్ సమాధి నుండి 600 మీటర్ల దూరంలో ఉన్న భద్రతా భవనం సమీపంలో ఈ పేలుడు సంభవించిందని అధికారులుతెలిపారు. బాంబు పేలుడు దాటికి సమీపంలోని షాపుల అద్దాలు పగిలిపోయాయి. ఒకదానికొకటి మంటలు చెలరేగడంతో ప్రజలు భయంతో పరుగులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలాఉంటే ఆ ప్రాంతంలోని భవనాలు ఆకుపచ్చ, ఎరుపు, నలుపు అఘారా జెండాలు, బ్యానర్లు వేలడదీసి కనిపించాయి.

Pune Horror Case: రూ.40వేల అప్పు చెల్లించలేదని భర్త ఎదుటే భార్యపై అత్యాచారం చేసిన షేక్

అఘరా అనేది ఇస్లామిక్ నెల ముహర్రం యొక్క 10వ రోజు. ఇది షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటి. ఇది ప్రస్తుత ఇరాక్ లో ఏడవ శతాబ్దంలో కర్బలా యుద్ధంలో ప్రవక్త మహమ్మద్ మనువడు, ఇమామ్ హుస్సేన్, అతని 72 మంది సహచరుల అమరవీరత్వాన్ని సూచిస్తుంది. అషురా సంతాప ఊరేగింపు యొక్క శిఖరాన్ని సూచిస్తుంది.