శ్రీలంకలో పేలుళ్లు: రక్తం దానం చేయమని కోరుతున్న బ్లడ్ బ్యాంక్స్

  • Published By: veegamteam ,Published On : April 21, 2019 / 09:25 AM IST
శ్రీలంకలో పేలుళ్లు: రక్తం దానం చేయమని కోరుతున్న బ్లడ్ బ్యాంక్స్

Updated On : April 21, 2019 / 9:25 AM IST

ఈస్టర్ పండుగ రోజు శ్రీలంక రక్త సిక్తంగా మారిపోయింది. దేశంలో ఆరు ప్రాంతాలలో బాంబు పేలుళ్లు సంభవించాయి. వరుస బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య పెరుగుతోంది. గాయపడినవారి సంఖ్య అధికంగా ఉంది. ఈ క్రమంలో బాధితుల చికిత్స నిమిత్తం బ్లడ్ బ్యాంక్‌లు ప్రజలను రక్తదానం చేయాల్సిందిగా కోరాయి. బట్టికాలోవాలోని ఆస్పత్రిలో అదేవిధంగా మీగమువ, నెగోంబో, త్రింకోమలె, నరెహెన్సింతియా కేంద్రాల్లోని బ్లడ్ ట్రాన్స్‌ఫార్మేషన్ సెంటర్లో ప్రజలు రక్తం దానం చేయాల్సిందిగా విన్నవించారు.
 

ఆరు చోట్ల పేలుళ్లు చోటుచేసుకున్నాయి. మూడు హోట‌ళ్లు, మూడు చ‌ర్చిల‌ను దుండ‌గులు టార్గెట్ చేశారు. కోట‌హెనాలో సెయింట్ అంథోనీస్ కొచ్చిగేడ్ చ‌ర్చి, బాలికోలాలోని జియాన్ చ‌ర్చి, సెయింట్ సెబాస్టియ‌న్ చ‌ర్చిలతో పాటు కొలంబోలోని కింగ్స్‌బ‌రీ, షాంగ్రీలా, సిన‌మోన్ గ్రాండ్ హోట‌ల్స్ వ‌ద్ద కూడా పేలుళ్లు జ‌రిగాయి. కొలంబోలో జ‌రిగిన పేలుళ్ల‌లో విదేశీయులు, స్థానికులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిని కొలంబో జ‌న‌ర‌ల్ హాస్ప‌ట‌ల్లో చేర్పించారు. ఇవాళ శ్రీలంకలో జ‌రిగిన వ‌రుస పేలుళ్లో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 185మంది చ‌నిపోయారు. తాజాగా మరో రెండు ప్రాంతాలలో పేలుళ్లు సంభవించటంతో దేశ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.