బ్రిటన్ ప్రధానికి మరో షాక్..పార్లమెంట్ రద్దు

బ్రెగ్జిట్ సంక్షోభం మధ్య బ్రిటన్ పార్లమెంటు తాత్కాలికంగా రద్దయింది. 5వారాల పాటు పార్లమెంటును రద్దూ చేస్తున్నట్లు యూకే ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబరు 14న పార్లమెంటు సమావేశాలను పునరుద్ధరిస్తారు. పార్లమెంటును ప్రోరోగ్ చేస్తూ ప్రధాని బోరిస్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పార్లమెంటును 5 వారాల పాటు సస్పెన్షన్‌లో ఉంచడం ప్రజాస్వామ్యానికే కళంకం అని లేబర్ పార్టీ నేత జెరిమి కార్బిన్ వ్యాఖ్యానించారు.
బ్రెగ్జిట్‌ను అమలు చేసి తీరుతానని ప్రధాని జాన్సన్ పదే పదే చెబుతున్నారు. దీనిలో భాగంగానే అక్టోబరు 15న ముందస్తు పార్లమెంటు ఎన్నికలకు వెళ్లాలన్న ప్రతిపాదనపై గట్టిగా పట్టుపడుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి ముందస్తు ఎన్నికల ప్రతిపాదనను హౌస్ ఆఫ్ కామన్స్(పార్లమెంట్) ముందుంచారు.
ఈ ప్రతిపాదనను మెజార్టీ ఎంపీలు తిరస్కరించారు. 434 సభ్యుల మద్దుతు కావాల్సి ఉండగా…293మంది మాత్రమే ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు. తన ప్రతిపాదన మరోసారి పార్లమెంట్ లో తిరస్కరించబడటంతో ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని బోరిస్ ఫైర్ అయ్యారు. బ్రెగ్జిట్ ను ఆలస్యం చేయ్యాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని అన్నారు.