బాత్రూమ్‌లో జారిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్‌సనారో

తన అధికార నివాసంలోని బాత్రూమ్ లో ఆయన జారి పడ్డారు. దీంతో ఆయనకు తలకు గాయాలవ్వటంతో స్థానిక సమయం రాత్రి 9 గంటలప్రాంతంలో ఆయన్నిఆర్మీ హాస్పటల్‌కు తరలించారు. డాక్టర్లు వెంటనే ఆయనకు సీటీ స్కాన్ చేశారు.
ఈ 2019 జనవరిలో బొల్‌సనారో బ్రెజిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2018లో బొల్ సనారోని ఎన్నికల ప్రచార సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచారు. దీంతో బొల్‌సనారో ట్రీట్‌మెంట్‌లో భాగంగా పలు మార్లు సర్జరీలు కూడా చేయించుకున్నారు. ఇప్పుడు బాత్రూమ్‌లో జారిపడడంతో ఆయన ఆరోగ్య సమస్యలు పెరిగినట్లుగా సమాచరం.