24 Carat Gold Bride Dress
24 Carat Gold Bride Dress: వివాహ వేడుకకు వధూ వరులు తాము ధరించే డ్రెస్ ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు.ముఖ్యంగా వధువు ధరించే డ్రెస్ విషయంలో మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారి డ్రెస్సును ప్రత్యేకించి డిజైన్ చేయించుకుంటారు. అలాగే కైలా అనే 24 ఏళ్ల యువతి కూడా అలాగే అనుకుంది. కానీ కైలా తన పెళ్లి గౌను అలాగిలా కాకుండా ‘బంగారం’లా ఉండాలని కోరుకుంది. అనుకున్నట్లుగానే ‘బంగారం’తోనే పెళ్లి గౌను తయారు చేయించుకుంది. ఆ గౌను వేసుకుని తెగ మురిసిపోయింది.
ఆమె ధరించిన పెళ్లి గౌను చూసినవారంతా ఆశ్చర్యపోయారు. ఏంటీ బంగారంలా మెరిసిపోతోంది అని అనుకున్నారు. ఆ గౌను నిజంగా అచ్చమైన బంగారంతో అంే 24 క్యారెట్స్ బంగారంతో తయారు చేయించుకుంది అని తెలిసి నోరెళ్లబెట్టారు. కౌలా ధరించిన పెళ్లి గౌన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కైలా 24 క్యారెట్ల బంగారు గౌను ధరించింది. వెడ్డింగ్ స్పెషల్ గా ధరించిన ఈ గోల్డ్ గౌనులో వధువు చంద్రబింబంలా మెరిసిపోతూ అందంగా కనిపించింది. మై బిగ్ ఫ్యాట్ అమెరికన్ జిప్సీ వెడ్డింగ్‌లో కనిపించిన కైలా.. టిమ్మీని వివాహం చేసుకుంది. తన పెళ్లి వేడుకను మరింత అందంగా మార్చుకోవడానికి కైలా గోల్డెన్ డ్రస్ ధరించింది. పెళ్లి కూతురు అత్తగారు కూడా గోల్డ్ గౌన్ ను ధరించమని చెప్పింది. దీంతో ఈ డ్రెస్ ను తయారు చేసి బాధ్యతను ఫ్యాషన్ డిజైనర్ సోండ్రా సీలీకి అప్పగించారు. అంతేకాదు భారీగా ఖర్చు పెట్టారు కూడా. 24 క్యారెట్ల గోల్డ్ గౌను తయారీని ఛాలెంజ్ గా తీసుకున్న సౌంద్ర .. మనసు పెట్టి మరి ఈ డ్రెస్స్ ను డిజైన్ చేసింది.
తన పెళ్లి వేడుకక్కి.. బంగారం దుస్తులు ధరించి రాగానే పెళ్ళికి వచ్చిన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కైలాని అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఇప్పటి వరకూ ఎవరూ బంగారంతో చేసిన గౌన్ ను ధరించక పోవడంతో వధువుని చూస్తూనే ఉండిపోయారు.