Boris Johnson : తాలిబన్లతో కలిసి పని చేయటానికి మేము రెడీ : బ్రిటన్ ప్రధాని

అఫ్గానిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్ ఉగ్రవాదులతో కలిసి పని చేయటానికి తాము సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.

Boris Johnson : తాలిబన్లతో కలిసి పని చేయటానికి మేము రెడీ : బ్రిటన్ ప్రధాని

Will Work With Talibans Says Britain Pm

Updated On : August 21, 2021 / 4:25 PM IST

Will work with Talibans says Britain PM : అఫ్గానిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లతో కలిసి పనిచేయటానికి మేం సిద్ధంగా ఉన్నామని ద గ్రేట్ బ్రిటన్ ప్రధాని ప్రకటించారు. ఇప్పటికే చైనా, పాకిస్థాన్, రష్యా దేశాలు తాలిబన్లకు మద్ధతు పలకగా తాజాగా బ్రిటన్ కూడా ఈ లిస్టులో చేరింది. ఇంతకీ బ్రిటన్ ప్రధాని తాలిబన్లతో కలిసి పనిచేయటానికి సిద్ధమని ఎందుకు ప్రకటించారంటే..ఆఫ్ఘానిస్థాన్ లో నెలకొన్ని సంక్షోభానికి పరిష్కారాన్ని చూపటానికి తాము అవసరమైతే తాలిబన్లతో కలిసి పని చేస్తాం అని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. అవసరమైతే రాజకీయ, దౌత్యపరమైన చర్యలను చేపడతామని తెలిపారి బ్రిటన్ ప్రధాని. ఆఫ్గాన్ పరిస్థితులను చక్కబెట్టటానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

తాలిబన్లతో కలిసి పని చేయటానికి తమకు అభ్యంతరం లేదని ఇప్పటికే చైనా ప్రకటించిన విషయం తెలిసిందే. అఫ్గాన్ సరిహద్దు దేహమైన పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కూడా మద్దతు ప్రకటించారు. రష్యా కూడా తాలిబన్లకు అనుకూలంగానే మాట్లాడింది. ఇప్పుడు బ్రిటన్ కూడా అదే అంటోంది. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతు..ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభానికి పరిష్కారాన్ని చూపటానికి తాము సిద్ధంగా ఉన్నామని అవసరమైతే తాలిబన్లతో కలిసి పని చేసి..అఫ్గాన్ పరిస్థితులను చక్కబెడతామని తెలిపారు.ఆఫ్గాన్ ప్రజలకు తాము భరోసా ఇవ్వాలనుకుంటున్నామని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

కాగా..అఫ్గాన్ రాజధాని కాబూల్ ఎయిర్ పోర్టులో పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయని అన్నారు. కాబూల్ నుంచి ఇప్పటి వరకు 1,165 మందిని బ్రిటన్ కు శనివారం (ఆగస్టు 20,2021) తరలించామని… వీరిలో బ్రిటన్ పౌరులు 399 మంది కాగా… రాయబార కార్యాలయ సిబ్బంది 320 మంది, ఆఫ్ఘన్లు 402 మంది ఉన్నారని తెలిపారు. అప్ఘానిస్థాన్ లో తాలిబన్ల అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో బోరిస్ జాన్సన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

కాగా అఫ్గాన్ నుంచి అమెరికా దళాలు మరలిపోయాక తాలిబన్లు దేశంపై విరుచుకుపడ్డారు.అదను కోసం ఎదురు చూస్తున్న తాలిబన్లు అమెరికా సైనిక దళాలు వారి దేశానికి తిరిగి వెళ్లిపోయాక అఫ్గాన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో దేశాధ్యక్షుడు కూడా తన కుటుంబంతో సహా పలాయనం చిత్తగించిన పరిస్థితి. ఆతరువాత అఫ్గాన్ లో పలు దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. దేశ పౌరుల పరిస్థితే కాకుండా పలు దేశాలకు చెందిన ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో అఫ్గాన్ నుంచి బయటపడటానికి యత్నించి ప్రాణాలు కోల్పోయినవారు కూడా ఉన్నారు. విమానం ఎక్కి దేశం విడిచిపోదామనుకున్న క్రమంలో విమానం నుంచి జారి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని తీవ్రంగా కలచివేసింది. అలాగే ఎంతోమంది దేశం విడిచిపోవటానికి పలు రకాలుగా యత్నిస్తున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్ధితి అత్యంత దారుణంగా దయనీయంగా మారింది.

ఈ క్రమంలో అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు భారతీయ పౌరులతో సహా మొత్తం 150 మంది ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్భంధించారనే వార్తలు వచ్చాయి. కొంతమంది C-17 విమానంలో ఇండియాకు వచ్చేందుకు సిద్ధమవుతుండగా.. తాలిబన్లు వీరిని బందిచినట్లుగాను..వీరిలో కొంతమందిపై దాడి చేసినట్లుగా తెలిసింది. ఆ తరువాత కొంతసేపటికి వ్యక్తుల పాస్‌పోర్ట్‌లను తనిఖీ చేసిన తర్వాత తాలిబాన్లు వారిని విడిచిపెట్టారు. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వెళ్లువెత్తడంతో వారిని వెంటనే కాబుల్ ఎయిర్‌పోర్టుకు తరలించినట్టు తెలుస్తోంది.

అంతకుముందు కిడ్నాప్ చేసిన వారందరినీ.. ఆల్‌కొజై గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు చెందిన ఆఫీసుల్లో నిర్భందించారు తాలిబన్‌ టెర్రరిస్టులు. వారివద్ద నుంచి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. భారతీయులతో పాటు మరికొందరు విదేశీయులను తాలిబన్‌లు కిడ్నాప్‌ చేశారనే సమాచారంతో అన్ని దేశాల బలగాలు అప్రమత్తం అయ్యాయి‌. అమెరికా సైనిక బలగాలు తాలిబన్ల కోసం వేటను ప్రారంభించగా.. అమెరికా బలగాలతో పాటు అఫ్ఘాన్ సైనికులు తమకోసం వేటాడుతున్నాయన్న ఇన్‌ఫర్మేషన్‌ తెలుసుకోగానే తాలిబన్‌లు భయపడ్డారు. వెంటనే తామెవరినీ కిడ్నాప్‌ చేయలేదని, అందరినీ కాబుల్ ఎయిర్‌పోర్టుకు తరలిస్తున్నట్టుగా అధికార ప్రతినిధులతో ప్రకటన చేయించారు. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో పలు దేశాలు అఫ్గాన్ సంక్షోభాన్ని సరిదిద్దటానికి ముందుకొస్తున్నట్లుగా తెలుస్తోంది.