Omicron In Britain : ఒమిక్రాన్‌తో బ్రిటన్‌లో 12 మంది మృతి

బ్రిటన్‌లో ఒమిక్రాన్ బారినపడి 12 మంది మృతి చెందినట్లుగా ఆ దేశ ఉపప్రధాని డొమినిక్‌ రాబ్ తెలిపారు. ప్రస్తుతం 104 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు

Omicron In Britain : ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. 90కి పైగా దేశాల్లో కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి. దీంతో వ్యాక్సినేషన్ పూర్తి కానీ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే బ్రిటన్‌లో నమోదవుతున్న ఒమిక్రాన్ మరణాలు కొత్త వేరియంట్‌పై మరింత భయం పెంచుతుంది. ఒమిక్రాన్‌ బారినపడి ఏకంగా 12 మంది మృతిచెందినట్టు అధికారికంగా ప్రకటించింది బ్రిటన్‌.. యూకేలో ఇప్పటి వరకు ఒమిక్రాన్‌తో 104 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరారని బ్రిటన్‌ ఉప ప్రధానమంత్రి డొమినిక్‌ రాబ్ వెల్లడించారు.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 12 మంది ఒమిక్రాన్‌ బాధితులు ప్రాణాలు విడిచారని తెలిపారు.

చదవండి : India Omicron : భారత్ లో 161 ఒమిక్రాన్ కేసులు : ఆరోగ్యమంత్రి

ఇక ప్రపంచ వ్యాప్తంగా 62 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. బ్రిటన్‌లో నిన్న ఒకే రోజు 10 వేల ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి.. ఇక, భారత్‌లో 173కి చేరాయి ఒమిక్రాన్‌ కేసులు, కర్ణాటకలో కొత్తగా 5 కేసులు బయటపడగా.. కేరళలో 4 కేసులు.. ఢిల్లీలో 6 పాజిటివ్‌ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే మన దేశంలో ఒమిక్రాన్ బాధితుల్లో ఒక్కరికి మాత్రమే ఆరోగ్యపరిస్థితి కొంచం విషమంగా ఉందని.. మిగతా వారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.

చదవండి : Omicron : ఒమిక్రాన్ బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమం, టిమ్స్ నుంచి గాంధీకి తరలింపు

 

ట్రెండింగ్ వార్తలు