చరిత్రలో తొలిసారి….బ్రిటీష్ విమాన సర్వీసులన్నీ రద్దు

  • Published By: venkaiahnaidu ,Published On : September 9, 2019 / 06:36 AM IST
చరిత్రలో తొలిసారి….బ్రిటీష్ విమాన సర్వీసులన్నీ రద్దు

Updated On : September 9, 2019 / 6:36 AM IST

తమ అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సోమవారం(సెప్టెంబర్-9,2019)బిటీష్ ఎయిర్ వేస్ సంస్థ ప్రకటించింది. బ్రిటిష్ ఎయిర్ లైన్స్ చరిత్రలోనే తొలిసారిగా పైలెట్లు సమ్మెకు దిగారు. జీతాల పెంపు విషయంలో యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో సెప్టెంబర్-9,10 రోజుల్లో  48 గంటల పాటు సమ్మె చేయాలని బ్రిటిష్ ఎయిర్ లైన్స్ పైలెట్ అసోసియేషన్(BALPA) నిర్ణయించింది.

దీంతో ప్రపంచ వ్యాప్తంగా బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ విమానాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దాదాపు 3లక్షల మంది ప్రయాణికులపై పైలెట్ల సమ్మె ప్రభావం చూపనుంది. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన మొత్తం 4వేల మూడు వందల మంది పైలెట్లు సమ్మెలో పాల్గొంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 27న మరోసారి ఆందోళన చేస్తామని పైలెట్లు ప్రకటించారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ సాధారణంగా 48గంటల సమయంలో 1700 విమానాలను ఆపరేట్ చేస్తుందని,సోమవారం 850 విమానాలను రద్దు చేయడానికి సిద్ధమైందని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది.

దురదృష్టవశాత్తు, ఏ పైలట్లు సమ్మెలో పాల్గొంటున్నారో BALPA నుండి ఎటువంటి వివరాలు లేనందున…ఎంతమంది పనికి వస్తారో, వారు ఏ విమానం నడపడానికి అర్హత కలిగి ఉంటారో అంచనా వేసే మార్గం తయకు లేదని, కాబట్టి మా విమానాలను దాదాపు 100 శాతం రద్దు చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు అంటూ బ్రిటీష్ ఎయిర్ వేస్ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.