తైవాన్‌పై జిత్తులుమారి చైనా దాడి చేయగలదా? అమెరికా చూస్తూ ఊరుకొంటుందా? ఇండియా ఏం చేయబోతోంది?

  • Publish Date - October 10, 2020 / 05:36 PM IST

China invade Taiwan : నక్కజిత్తుల డ్రాగన్ చైనా కవ్వింపులకు తెగబడుతోంది. ప్రపంచ దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ప్రపంచ ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగబడేందుకు డ్రాగన్ కుయుక్తులు పన్నుతోంది. ఎప్పటినుంచో జిన్‌పింగ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏడు దశాబ్దాలకు పైగా తైవాన్‌పై దాడి చేస్తామని బెదిరిస్తోంది. విశ్లేషకులు, అధికారులు పెట్టుబడిదారుల మధ్య ఇప్పుడు ఈ గుబులే పట్టుకుంది. రాబోయే కొన్నేళ్లలో చైనా అనుకున్నది నిజం చేసేలా కనిపిస్తోంది.



అదే జరిగితే అమెరికాతో యుద్ధాన్ని దారితీసినట్టే. గత సెప్టెంబరు నెలలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ విమానం.. తైవాన్ జలసంధిలో మధ్యస్థ రేఖను పలుమార్లు ఉల్లంఘించింది.. దశాబ్దాలుగా శాంతికి చిహ్నంగా మారిన వాస్తవ బఫర్ జోన్‌ను డ్రాగన్ తొలగించింది. తైవాన్ మీదుగా స్కైస్ పెట్రోలింగ్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. తైవాన్ దాడులకు పాల్పడితే ప్రతిదాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని చైనా వైమానిక దళాన్ని కోరింది. మరోవైపు తమపై దాడి చేస్తేనే షూట్ చేస్తామని తైవాన్ ప్రకటించింది.

చైనా, తైవాన్ దేశాలు.. అమెరికా దాని మిత్రదేశాలతో అణు వివాదానికి దారితీసే యుద్ధాన్ని నివారించడానికి అనేక కారణాలు ఉన్నాయి. సైనిక బెదిరింపులు, దౌత్యపరమైన ఒంటరితనం, ఆర్థిక ప్రోత్సాహకాల ద్వారా తైవాన్‌ను నియంత్రించే ప్రయత్నాలను బీజింగ్ కొనసాగిస్తుందనే ఏకాభిప్రాయం లేకపోలేదు.



మరోవైపు జిత్తులుమారి డ్రాగన్ కోల్పోయిన భూభాగాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తోంది. ఇలా తమ వారసత్వాన్ని సుస్థిరం చేసుకోవాలనే అధ్యక్షుడు జిన్‌పింగ్ కోరిక కూడా. తైవాన్‌పై చైనా దండయాత్ర ముప్పు ఉందని, తైవాన్ రక్షణ ఆసియాలో అమెరికన్ వ్యూహమని అంటున్నారు. రాబోయే ఐదు నుండి 10 సంవత్సరాలు ప్రమాదకరమైనవిగా విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికాలో ఎవరూ గెలిచినా తైవాన్‌కు ఒరిగేది ఏముండదు:
నవంబర్ 3న అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచినా తైవాన్ భద్రతా సమస్యలను ఎదుర్కొంటునే ఉంటుంది. దీనివల్ల తైవాన్ కు ఒరిగేది ఏముండదు..  తైపీ వాషింగ్టన్‌‌లో ద్వైపాక్షిక మద్దతు తిరిగి పుంజుకుంటోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తైవాన్ వ్యూహాత్మక గురించి సందేహాన్ని వ్యక్తం చేశారు. ఏ దాడిలోనైనా తైవాన్‌ను అమెరికా రక్షించాలా వద్దా అని కాంగ్రెస్ నిర్ణయించాలని డెమొక్రాటిక్ నామినీ జో బిడెన్ గతంలోనే చెప్పారు.



ఈస్టన్ వంటి విశ్లేషకులు.. సైనిక వ్యాయామాలు, ఆయుధాల కొనుగోళ్లు, ప్రధాన ఆటగాళ్ల వ్యూహాత్మక పత్రాల ఆధారంగా తైవాన్‌పై చైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని ముందుగానే ఊహించారు. ఇందులో యుఎస్ సాయం చేయడానికి ముందు PLA ప్రధాన ద్వీపాన్ని టార్గెట్ చేసేందుకు ప్రయత్నించనుంది.



సైనిక సమతుల్యత బీజింగ్‌కు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. Stockholm International Peace Research Institute నుండి వచ్చిన అంచనాల ప్రకారం.. చైనా తైవాన్ కంటే 25 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తుంది. క్షిపణులు, ఫైటర్ జెట్ల నుంచి యుద్ధనౌకలు, దళాల స్థాయిల వరకు పటిష్టంగానే కనిపిస్తోంది.



చైనా దండయాత్రకు ముందు.. సైబర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ యూనిట్లు తైవాన్ ఆర్థిక వ్యవస్థ కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. వైమానిక దాడులు తైవాన్ అగ్ర రాజకీయ, సైనిక నేతలను అంతం చేయడమే చైనా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చైనా కవ్వింపు చర్యలను భారత్ ఎప్పటికప్పుడూ తిప్పికొడుతూనే ఉంది.

ట్రెండింగ్ వార్తలు