Covid-19 Vaccine : వ్యాక్సిన్ వేయించుకోకుంటే..తల్లితండ్రులు పిల్లలతో గడిపే హక్కు కోల్పోతారు : కోర్టు సంచలన తీర్పు

వ్యాక్సిన్ వేయించుకోకుంటే..తల్లితండ్రులు పిల్లలతో గడిపే హక్కు కోల్పోతారని కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పిల్లలతో గడపాలనుకుంటే వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించింది.

Corona Vaccine : కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని తల్లిదండ్రులకు పిల్లలతో గడిపే హక్కులేదంటూ కెనడాలోని క్యూబెక్‌ సుపీరియర్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తండ్రిగా పిల్లలపై పూర్తి హక్కులున్నా ప్రస్తుతం కోవిడ్ తో పాలు పలు వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్న ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ వేయించోని తల్లిదండ్రులకు పిల్లలను కలిసే అవకాశం మాత్రం లేదంటూ తీర్పులో జస్టిస్ J. సెబాస్టియన్ పేర్కొన్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

Also read : Attack Sikh Taxi Driver in US:అమెరికాలో సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై దాడి..తలపాగా లాగి పడేసి అసభ్యపదజాలంతో దూషణ

కాగా కెనడాకు చెందిన ఓ తల్లి తన భర్త తన పిల్లల్ని కలవటానికి అంగీకరించాలేదు. దీంతో ఆమె భర్త తన సెలవు రోజుల్లో తన పిల్లలతో ఎక్కువ సమయం గడిపేలా అవకాశం ఇవ్వాలని కోరుతు న్యాయస్థానాన్నిఆశ్రయించాడు. అతని భార్య మాత్రం తన భర్త వ్యాక్సిన్ వేయించుకోలేదని..దీనికి సాక్ష్యంగా సదరు వ్యక్తి వ్యాక్సిన్‌ తీసుకోలేదంటూ అతను ఫేస్‌బుక్‌, సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌లను కోర్టులో చూపించింది.

Also read : AP PRC Issue : ఏపీలో పీఆర్సీ లొల్లి మళ్లీ షురూ…

భర్త కోసం తన పిల్లల జీవితాన్ని పణంగా పెట్టలేనని ఆమె న్యాయస్థానానికి విన్నవించుకుంది. భార్యా భర్తల వాదనలు విన్న ధర్మాసం ఈ వాదనలు విన్న క్యూబెక్‌ సుపీరియర్‌ కోర్టు జడ్జి తండ్రి వ్యాక్సిన్‌ వేసుకోనప్పుడు పిల్లలతో గడిపే హక్కు లేదని స్పష్టం చేస్తు తీర్పునిచ్చారు. ప్రస్తుతం ఉన్న ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోందని పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ తల్లిపడే ఆందోలన సరైనదేనని పేర్కొంది. ఆ తల్లి ఆందోళనలో న్యాయం ఉందని..పిల్లలను కలవాలని..వారితో సమయం గడపాలని తండ్రి ఆంకాంక్షిస్తే వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.

Also read : Coronavirus: ‘మేకెదాటు’ర్యాలీ ఎఫెక్ట్..కాంగ్రెస్‌ లో కరోనా..మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీకి పాజిటివ్‌..

క్యూబెక్‌ సుపీరియర్‌ కోర్టు జడ్జి సెబాస్టియన్ వ్యాక్సిన్‌లు తీసుకోనివాళ్ల పై ఆరోగ్య పన్ను విధించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా..వ్యాక్సిన్‌ తీసుకోనివాళ్లను బయటకు రాకుండా నిషేధించింది కెనడా ప్రభుత్వం.

 

ట్రెండింగ్ వార్తలు