AP PRC Issue : ఏపీలో పీఆర్సీ లొల్లి మళ్లీ షురూ…

అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ ఇచ్చిన నివేదికను తమకు ఇవ్వాలని సీఎస్‌కు ఇచ్చిన లేఖలో కోరారు ఉద్యోగులు.. దీంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది...

AP PRC Issue : ఏపీలో పీఆర్సీ లొల్లి మళ్లీ షురూ…

Ap Prc

PRC Issue In AP : ఏపీలో పీఆర్సీ లొల్లి మళ్లీ మొదలైంది.. ఎంత పీఆర్సీ ఇవ్వాలన్నదానిపై అనేక సమావేశాలు.. అభ్యంతరాలు.. కమిటీల ఏర్పాటు.. చర్చోపచర్చల తర్వాత ఎట్టకేలకు 23.29 పీఆర్సీ ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది అనుకున్నారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదంటూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మళ్లీ గొంతెత్తారు.. సీఎస్‌ సమీర్‌ శర్మను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం పలుసార్లు చర్చలు జరిపినప్పటికీ తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.. అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ ఇచ్చిన నివేదికను తమకు ఇవ్వాలని సీఎస్‌కు ఇచ్చిన లేఖలో కోరారు ఉద్యోగులు.. దీంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

Read More : UP Election 2022 : బీజేపీకి షాక్‌‌లు…ఉత్సాహంలో సమాజ్‌‌వాది పార్టీ

2010లో అప్పటి పీఆర్సీ సిఫార్సులతో 39 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాని.. ప్రస్తుతం 30 శాతమైనా ప్రకటించి ఉండాల్సిందని ఉద్యోగులు అన్నారు… హెచ్‌ఆర్‌ఏ, సీసీఏలు యథాతథంగా కొనసాగించాలని కోరారు. 70-79 ఏళ్ల మధ్య ఉన్న పెన్షనర్లకు అదనంగా 10 శాతం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు వెంటనే చెల్లించాలన్నారు. ఇక సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు భత్యాలు కొనసాగించాలని విజ్జప్తి చేశారు. అంతేగాకుండా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1993 నుంచి పనిచేస్తున్న కంటింజెంట్, ఒప్పంద సిబ్బందిని క్రమబద్దీకరించాలని కోరింది.. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా తెలిపింది.

Read More : Jagan-Chiru : సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ

ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది.. ఈ నిర్ణయం వల్ల ఏటా ఖజానాపై 10 వేల 247 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాన్ని ముగిసిన అధ్యాయంలా చూస్తుందా? లేక ఉద్యోగుల డిమాండ్లపై దృష్టి సారిస్తుందా? ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యోగులు మళ్లీ పోరుబాట పడతారా? అన్నది చూడాలి.