Jagan-Chiru : సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ

గంట, గంటన్నరలో సీఎంతో చర్చించి వస్తా.. అన్నింటికీ బదులిస్తా అని చెప్పి వెళ్లిపోయారు. 

Jagan-Chiru : సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ

Chiru Jagan

Updated On : January 13, 2022 / 2:23 PM IST

Jagan _ Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ మధ్యాహ్నం (2022, జనవరి 13) ఒంటి గంట సమయంలో జగన్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఈ భేటీ జరుగుతోంది.

ఫ్లైట్ లో ఈ ఉదయం 11గంటలకు హైదరాబాద్ బేగంపేట నుంచి విజయవాడకు బయల్దేరి వెళ్లారు చిరంజీవి. గన్నవరం నుంచి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు రోడ్డు మార్గంలో వెళ్లారు. తన ఇంటికి వచ్చిన చిరంజీవికి ఏపీ సీఎం జగన్ సాదరంగా స్వాగతం పలికారు. ఫ్లవర్ బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పారు. ఇంట్లోకి వెళ్లిన చిరంజీవి.. ముఖ్యమంత్రికి పుష్ప గుచ్ఛం ఇచ్చారు.  ఆ తర్వాత నారింజ రంగు పట్టు కండువాతో జగన్ ను సత్కరించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఫొటోలకు పోజులిచ్చారు.

Read More : Akhanda : మల్టీప్లెక్స్‌లో మాస్ జాతర.. ఏఎమ్‌బి సినిమాస్‌లో ‘అఖండ’ అరాచకం..

ఏపీలో థియేటర్లు, టికెట్ రేట్ల ఇష్యూ, షోల సంఖ్య సహా తెలుగు సినీ ఇండస్ట్రీకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న సమస్యలు చిరంజీవి, జగన్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే చాన్సుంది. మీటింగ్ కు ముందు విజయవాడలో మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. గంట, గంటన్నరలో సీఎంతో చర్చించి వస్తా.. అన్నింటికీ బదులిస్తా అని చెప్పి వెళ్లిపోయారు.

Read More : Akkineni Nagarjuna: మా సమస్యల పరిష్కారం కోసమే సీఎం దగ్గరకు చిరంజీవి -నాగార్జున