Attack Sikh Taxi Driver in US:అమెరికాలో సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై దాడి..తలపాగా లాగి పడేసి అసభ్యపదజాలంతో దూషణ

అమెరికాలో సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు అతని తలపాగా లాగి పడేసి అసభ్యపదజాలంతో దూషించిన వీడియో వైరల్ గా మారింది.

Attack Sikh Taxi Driver in US:అమెరికాలో సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై దాడి..తలపాగా లాగి పడేసి అసభ్యపదజాలంతో దూషణ

Attack On Sikh Taxi Driver In Us

Attack on Sikh Taxi Driver in US : అమెరికాలోని జాన్‌ ఎఫ్ కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టువో వద్ద ఓ సిక్కు ట్యాక్సీ డ్రైవర్ పై కొంతమంది దాడికి తెగబడ్డారు. భారత సంతతి సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై కొంతమంది దాడికి పాల్పడి అతని తలపాగాను లాగి కిందపడేసి ఇష్టానురీతిగా తిట్టారు. అసభ్యపదజాలంతో దూషించి దారుణంగా కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిక్కులు తలపాగాను ఎంతో గౌరవంగా భావిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోను తలపాగాకు కిందపడనివ్వరు బయటి వ్యక్తుల్ని తాకనివ్వరు కూడా. అటువంటిది సదరు సిక్కు డ్రైవర్ తలపాగాను లాగి కిందపడేసి దారుణంగా తిట్టారు. కొట్టారు. జనవరి 4న జరిగిన దాడికి సంబంధించిన 26 సెకన్ల నిడివి గల వీడియోను నవజ్యోత్‌ పాల్‌ కౌర్‌ అనే మహిళ తన ట్విట్టర్‌ లో ఈ వీడియోను పోస్ట్‌ చేయటంతో అది వైరల్‌గా మారింది.

Also read : UP Election: యూపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. సామాన్యులకే సీట్లు.. ఉన్నావ్ బాధితురాలి తల్లికి టిక్కెట్!

ఈ వీడియోలో సదరు దుండగులు ఆ సిక్కు డ్రైవర్ ను కొట్టడం, అసభ్యపదజాలంతో దూషించడం..అతని తలపాగాను లాగి కింద పడేసినట్లుగా ఉంది. “తలపాగా ధరించిన ప్రజలారా, మీ దేశానికి తిరిగి వెళ్లండి” అన్నట్లుగా ఉంది. ఈ ఘటన జేఎఫ్ కే ఎయిర్ పోర్టు వద్ద జరిగిందని..కానీ ఈ వీడియోతో తనకు సంబంధం లేదని కౌర్‌ వివరించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈ వీడియో తీశాడని పేర్కొంది. అమెరికాలో ఇంకా ద్వేషపూరిత దాడులు జరగుతున్నాయని తెలియజేయటానికే ఈ వీడియోను పోస్ట్ చేసానని నవజ్యోత్‌ వెల్లడించింది. సిక్కు క్యాబ్‌ డ్రైవర్లపై దాడులు జరగడం తాను పలుమార్లు చూశానని..బాధితుడి గోప్యతను కాపాడటానికి అతని వివరాలు చెప్పడం లేదని పేర్కొంది.

కాగా ఈ వీడియోను చూసిన పంజాబీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమెరికాలోని భారత కాన్సులేట్‌ కార్యాలయం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. దాడిని తీవ్రంగా పరిగణించి అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే విచారణ చేపట్టి నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తు..ఈ దాడి తమను తీవ్రంగా కలచివేసిందని..భిన్నత్వమే అమెరికాను మరింత బలంగా మారుస్తుందని..ఇటువంటి ద్వేషపూరిత దాడులను ఏ మాత్రం సహించేది లేదని తెలిపింది.

Also read : Covid in china : ఐరన్ బాక్సుల్లో గ‌ర్భిణులు,చిన్నారుల నిర్భంధం..వృద్ధులను కూడా వదలని చైనా Viral video

త్వరలోనే నిందితుడిని పట్టుకుని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని భారత దౌత్యకార్యాలయానికి హామీ ఇచ్చింది. కాగా తలపాగా ధరించడం సిక్కుల సంప్రదాయమని, తమ గౌరవానికి సూచికని, ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని పంజాబీలు మండిపడుతున్నారు. అయితే బాధితుడి గోప్యత దృష్ట్యా ఈ వీడియోలను ఎవరూ ప్రసారం చేయద్దని వారు కోరుతున్నారు.

ఈ ఘటనపై సిక్కు కూటమి లీగల్ డైరెక్టర్ అమృత్ కౌర్ అక్రే మాట్లాడుతు..“మిస్టర్ సింగ్‌కు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్రతి ఒక్కరినీ సిక్కు కూటమి అభినందిస్తుందని తెలిపారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడికి..సిక్కు సమాజానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. సిక్కు సమాజం న్యూయార్క్ నగరంలో అంతర్భాగమని ఆయన మిస్టర్ అక్రే అన్నారు.