Coronavirus: ‘మేకెదాటు’ర్యాలీ ఎఫెక్ట్..కాంగ్రెస్‌ లో కరోనా..మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీకి పాజిటివ్‌..

కాంగ్రెస్‌ పార్టీలోకరోనా కలకలం రేపింది. కార్ణాటకలో కాంగ్రెస్ చేపట్టి ‘మేకెదాటు’పాదయాత్ర ఎఫెక్ట్ కాంగ్రెస్ లో ప్రభావంచూపింది. మల్లిఖార్జున ఖర్గే, వీరప్ప మొయిలీకి పాజిటివ్‌.

Coronavirus: ‘మేకెదాటు’ర్యాలీ ఎఫెక్ట్..కాంగ్రెస్‌ లో కరోనా..మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీకి పాజిటివ్‌..

Coronavirus In congress

Coronavirus in Congress :  థర్డ్ వేవ్ లో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కోవిడ్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఎంతోమంది సీనీ,రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారినపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కోవిడ్ బారిన పడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే,వీరప్ప మొయిలీకి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ‘మేకెదాటు’ పాదయాత్రలో ఖర్గే పాల్గొన్నారు. కావేరి నదికి అడ్డంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ మొత్తం 10 రోజుల పాటు ఆ యాత్ర కొనసాగింది. ఇందులో ఖర్గేతో సహా మరో కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ కూడా పాల్గొన్నారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే కేంద్రమంత్రులు, ఎంపీలు కోవిడ్ బారినపడిన విషయం తెలిసిందే.ఈక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని ఖర్గే కార్యాలయం ప్రకటించింది.

Also read : UP Election 2022 : బీజేపీకి షాక్‌‌లు…ఉత్సాహంలో సమాజ్‌‌వాది పార్టీ

కానీ ఖర్గేకు ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేకపోవటం గమనించాల్సిన విషయం. కానీ పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో ఆయన హోం ఐసోలేషన్‌ లో ఉన్నారని తెలిపింది. ఖర్గే రెండు డోసులు తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని ఖర్గే ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు సిబ్బందికి కొవిడ్‌ పాజిటివ్‌ గా తేలింది. కాగా కొవిడ్‌ బారిన పడిన మల్లికార్జున ఖర్గే గత రెండురోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ‘మేకెదాటు’ పాదయాత్రలో ఖర్గేతో సహా మరో కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ కూడా పాల్గొన్నారు. దీంతో ఇద్దరికి పాటిజివ్ గా నిర్దారణ అయ్యింది. ఈ లాంగ్ మార్చ్‌లో పాల్గొన్న మాజీ మంత్రి హెచ్ఎం రేవణ్ణ, ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం, ఎమ్మెల్యే ఎన్ హెచ్ శివశంకరరెడ్డి కూడా వైరస్‌ బారిన పడ్డారు. కాగా ఈ ర్యాలీకి సారథ్యం వహించిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాత్రం తాను కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోనని చెప్పటం విశేషం. ఈ ర్యాలీలో పాల్గొన్న పలువురికి కోవిడ్ సోకటంతో కాగా వారితో పాటు కాంటాక్ట్ అయినవారు కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

Also read : UP Election: యూపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. సామాన్యులకే సీట్లు.. ఉన్నావ్ బాధితురాలి తల్లికి టిక్కెట్!

బెంగళూరు మాజీ మేయర్ గంగాంబికే మల్లికార్జున్‌తో పాటు ఇతర మహిళా నేతలు కమలాక్షి రాజన్న, మంజుల మానసలకు పాజిటివ్‌ వచ్చింది. ఎమ్మెల్యే లక్ష్మీ హేబల్లాకర్ కూడా జ్వరంతో బాధపడుతున్నారు. కాగా..రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి చెందుతోందని కాబట్టి నేపథ్యంలో ర్యాలీని ఆపాలని కర్ణాటక సీఎం బొమ్మై కాంగ్రెస్‌ను కోరారు.

ఇంతకుముందు..కర్ణాటకలో కోవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించినందుకు రాష్ట్ర పార్టీ కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్, మాజీ సిఎం సిద్ధరామయ్య సహా 30 మందిపై కేసు నమోదు చేయబడింది. జిల్లా ఆరోగ్యశాఖ అధికారి వారిని కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరగా ఆయనపై శివకుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తు..‘రేయ్‌ మిస్టర్‌, నేను ఫిట్‌ అండ్‌ ఫైన్‌’ అంటూ కోవిడ్ పరీక్ష చేయించుకోవానికి నిరాకరించారు.

Also read : Dr Simon Bramhall : రోగులకు కాలేయ మార్పిడి చేసి..ఆ కాలేయాలపై తన పేరు రాసుకున్న డాక్టర్