MP naked on Zoom call : జూమ్ కాల్ లో పార్లమెంట్ సమావేశాలు..న్యూడ్ గా కనిపించిన ఎంపీ..

MP naked on Zoom call : జూమ్ కాల్ లో పార్లమెంట్ సమావేశాలు..న్యూడ్ గా కనిపించిన ఎంపీ..

Mp Naked On Parliamentary Zoom Call

Updated On : April 16, 2021 / 11:13 AM IST

Canadian MP accidentally appears naked on Parliamentary Zoom call : కరోనా పుణ్యమాని న్యాయస్థానాలు..చట్టసభలు కూడా మూతపడ్డాయి. కేసులు విచారణలు జూమ్ కాల్స్ లోనే జరుగుతున్నాయి. కరోనా వల్లనే ఓ దేశంలో ఏకంగా పార్లమెంట్ సమావేశాల్ని కూడా జూమ్ కాల్ లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేవాలు జూమ్ కాల్ లో జరుగుతున్న సమయంలో ఓ ఎంపీ జూమ్ లో నగ్నంగా కనిపించాడు. దీంతో సభాధ్యక్షుడితో పాటు తోటి ఎంపీలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఘటన కెనడాలో జరిగింది. పొరపాటు గా జరిగినా..ఫన్నీగా జరిగినా గానీ పాపం సదరు ఎంపీ డంగౌపోయాడు. ఆ తరువాత క్షమాపణలు చెప్పుకున్నాడు.

ప్రపంచ దేశాలతో పాటు కరోనా కెన‌డాను కూడా హడలెత్తిస్తోంది. దీంతో పార్లమెంట్ సమావేశాల్ని జూమ్ కాల్ లో జరిగిలే ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో విలియ‌మ్ ఆమోస్‌ అనే ఎంపీ నగ్నంగా కనిపించటంతో సభాధ్యక్షుడితో పాటు తోటి ఎంపీలంతా షాక్ అయ్యారు. విలియ‌మ్ ఆమోస్‌ది క్యూబెక్ జిల్లాలోని పాంటియాక్ నియోజ‌క‌వ‌ర్గం. లిబ‌రల్ పార్టీకి చెందిన ఆ ఎంపీ మిలియమ్ ఆమోస్. ఈక్రమంలో విలియమ్ ఉదయాన్నే లేచి జాగింగ్ కు వెళ్లి వచ్చాడు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన సమయం దగ్గరపడిందని స్నానం చేయకుండానే సమావేశాల్లో పాల్గొందామనుకున్నారు. తన ల్యాప్‌టాప్ కెమెరా ఆన్ చేసి ఇంకా కొంచెం టైమ్ఉందికదాని ఈ టైమ్ లో బట్టలు మార్చేసుకుందామని అనుకున్నారు.

అలా బట్టలు మార్చుకునే సమయంలోనే జూమ్ వీడియో సడెన్ గా ఆన్ అయ్యింది. దాంతో అతను సమావేశాల్లో నగ్నంగా కనిపించాడు. ఈ ఘటన పొరపాటున జరిగిందని తనను క్షమించాలను కోరుకున్నాడు. దాంతో తాను న‌గ్నంగా క‌నిపించాల్సి వ‌చ్చింద‌న్నారు. ఎంపీ ఆమోస్ న‌గ్నంగా ఉన్న ఓ స్క్రీన్ షాట్ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఆ ఘ‌ట‌న త‌న‌ను ఇబ్బందికి గురి చేసింద‌న్నారు. నిజాయితీగా త‌ప్పును ఒప్పుకుంటున్నాన‌ని..మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చారు.దయచేసి నా పొరపాటుకు హౌజ్ ఆఫ్ కామ‌న్స్ స‌భ్యుల‌ంతా క్షమించాలని ట్విట్ట‌ర్‌ వేదికగా కోరారు. కాగా..కెన‌డా పార్ల‌మెంట్ స‌భ్యులు ఎటువంటి స‌మావేశాల్లో పాల్గొన్నా వాళ్లు క‌చ్చితంగా టై, జాకెట్ ధ‌రించాల్సి ఉంటుంది. అధ్య‌క్షుడు జ‌స్టిన్ ట్రూడో ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఇంకా ఎటువంటి రియాక్ష‌న్ ఇవ్వ‌లేదు.