America : హ్యాండ్ శానిటైజర్ రాసుకున్నాడు..కారు తగలబడింది, వీడియో వైరల్

శానిటైజర్ అధికంగా ఉపయోగించడం అదే సమయంలో...సిగరేట్ వెలిగించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.

America : హ్యాండ్ శానిటైజర్ రాసుకున్నాడు..కారు తగలబడింది, వీడియో వైరల్

Car Flame

Updated On : May 17, 2021 / 9:45 AM IST

Hand Sanitizer : కరోనా..కరోనా..ప్రపంచానికి ఈ వైరస్ టెన్షన్ పట్టుకుంది. ఎంతకీ తగ్గుముఖం పట్టడం లేదు. దీనిని నుంచి కాపాడుకొనేందుకు శానిటైజర్స్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. ప్రధానంగా బయటకు వెళ్లే సమయంలో శానిటైజర్స్, మాస్క్ లు కంపల్సరీగా ఉపయోగిస్తున్నారు. అయితే..చాలా మంది శానిటైజర్స్ అధికంగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలతో పాటు..కొన్ని ప్రమాదాలకు గురవుతున్నారు.

శానిటైజర్ రాసుకుని సిగరేట్ ముట్టడించడంతో చాలా మంది కాలిన గాయాలయ్యాయి. తాజాగా..ఓ వ్యక్తి శానిటైజర్ అధికంగా ఉపయోగించడం అదే సమయంలో…సిగరేట్ వెలిగించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన అమెరికాలోని మేరిల్యాండ్‌లో చోటు చేసుకుంది. రోడ్డుపై కారులో వెళ్తున్న ఒక వ్యక్తి.. హ్యాండ్ శానిటైజర్ ఎక్కువగా ఉపయోగించడం..అదే సమయంలో అతను సిగరెట్ తాగుతున్నాడు.

దీంతో శానిటైజర్ అంటుకొని కారు మొత్తం తగలబడి పోయింది. కారులో వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నాలు చేశారు. అగ్నికి ఆహుతవుతున్న కారు వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.