పిల్లికి కూడా కరోనా.. ఇదేంది మచ్చా!!

కరోనా ఎక్కడ.. ఎవరికి వస్తుందో అర్థం కావడం లేదు. నెలల పసికందు నుంచి పండు ముసల దాకా కవర్ చేసిన కరోనా.. పిల్లులకు కూడా వ్యాపిస్తుంది. ఇదేదో రూమర్ కాదు. అనుమానం అంతకంటే కాదు. చేసిన టెస్టుల్లోపాజిటివ్ వచ్చిందని ఎన్నిరాన్మెంట్ మినిస్ట్రీనే వెల్లడించింది. ఇన్ని రోజులు పెంపుడు జంతువులకు కరోనా సోకదని వాటి ఇమ్యూనిటీ పవర్ మీద నమ్మకంతో ఉన్నాం.
ఇప్పుడు ఇంగ్లాండ్ లో పిల్లికి కరోనా సోకిందని తెలియడంతో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇందులో సంతోషించాల్సిన విషయం ఏమిటంటే యజమానులతో పాటు పెంపుడు జంతువైన పిల్లి కూడా కరోనా నుంచి బయటపడింది. ఆ పిల్లి మరే జంతువుతో కలవలేదు. అని మినిస్ట్రీ చెప్పుకొచ్చింది.
ఇంగ్లాండ్‌లో పెంపుడు జంతువైన పిల్లికి కరోనా పాజిటివ్ రావడం ఇదే తొలిసారి. ఇదేదే ప్రమాదఘంటిక అని చెప్పలేమని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ మెడికల్ డైరక్టర్ అంటున్నారు. మనుషుల నుంచి జంతువులకు సోకడంపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని ఆయన అన్నారు. బుధవారం ఇన్ఫెక్షన్ ను ల్యాబ్ టెస్టుల్లో కన్ఫామ్ చేశారు. అయితే పిల్లుల నుంచి మనుషులకు కరోనా వ్యాప్తి చెందుతుందని ఎలాంటి ఎవిడెన్స్ లు లేవు.
పిల్లులు చాలా తక్కువ నిరోధక శక్తి కల జంతువుల్లో ఒకటి. ఇవి ఇతర పిల్లులకు SARS-CoV2కరోనావైరస్ ను త్వరగా వ్యాప్తి చేస్తాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) చెప్తుంది.
యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీలు టెస్టులు నిర్వహించి ఇంగ్లాండ్ లో పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్ అని తేల్చిచెప్పారని చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ క్రిస్టిన్ మిడిల్ మిస్ అన్నారు. జంతువులకు వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యేది చాలా అరుదైన సందర్భం. కొద్ది రోజుల్లోనే వైరస్ నుంచి కోలుకోగలవు. అని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది.