Tail Boy : వింత ఘటన.. తోకతో జన్మించిన బాలుడు

మానవుడు కోతి నుంచి వచ్చాడని అంటుంటారు. మొదట మానవుడికి తోకలు ఉండేవని క్రమేణా అవి అంతరించి పోయాయని చెబుతుంటారు.

Tail Boy : వింత ఘటన.. తోకతో జన్మించిన బాలుడు

Tail Boy

Updated On : November 6, 2021 / 5:11 PM IST

Tail Boy :  మానవుడు కోతి నుంచి వచ్చాడని అంటుంటారు. మొదట మానవుడికి తోకలు ఉండేవని క్రమేణా అవి అంతరించి పోయాయని చెబుతుంటారు. మానవ పరిణామ క్రమంలో చోటు చేసుకున్న మార్పుల మూలంగా తోక లేకుండా పోయిందని పరిశోధకులు. అయితే తాజాగా బ్రెజిల్ ఓ బాలుడు తోకతో పుట్టాడు. ఆ తోక 12 సెం.మీ పొడవుతో చివరన గద ఆకారంలో ఓ బంతి ఉంది. అయితే జన్యుపరమైన లోపల కారణంగా పిల్లలు ఈ విధంగా జన్మిస్తుంటారని వైద్యులు చెబుతున్నారు. ఇక బ్రెజిల్ లో తోకతో జన్మించిన బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. అతడి శరీరం నుంచి ఆ తోకను తొలగించమని వైద్యులు తెలిపారు.

చదవండి : 2 heads 3 eyes calf born : 2 తలలు,3 కళ్లతో పుట్టిన ఆవు దూడ..అమ్మవారి అవతారమంటూ పూజలు

బ్రెజిల్, ఫోర్టలేజాలోని ఆల్బర్ట్ సబిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో శిశువు జన్మించిన సమయంలో ‘తోక’ 12 సెం.మీ వరకు పెరిగి 4 సెం.మీ వ్యాసం కలిగిన బంతిని కలిగి ఉన్నట్లు మెడికల్ జర్నల్ తన నివేదికలో పేర్కొంది. డాక్టర్లు శస్త్ర చికిత్స ద్వారా ఆ శిశువుకు తోకను తొలగించినట్లు తెలిపారు. ఇలాంటి అరుదైన కేసులు సుమారు 40 వరకు చూశామని చెప్పారు.

చదవండి : New Born Babies: కరోనా సమయంలో పుట్టిన పిల్లల్లో IQ బాగా తక్కువ