Mountain Lion Hiding : షాకింగ్ వీడియో.. అటుగా వచ్చిన మహిళను చూసి ఆ సింహం ఏం చేసిందంటే..

సాధారణంగా.. మనిషిని చూడగానే.. క్రూరమృగాలు అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాయి. తమకు ఎక్కడ హాని చేస్తారో అనే భయంతో అవి దాడికి పాల్పడతాయి. అయితే, ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరిగింది.

Mountain Lion Hiding : షాకింగ్ వీడియో.. అటుగా వచ్చిన మహిళను చూసి ఆ సింహం ఏం చేసిందంటే..

Updated On : September 30, 2022 / 10:47 PM IST

Mountain Lion Hiding : అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ తరహా ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. అడవుల నరికివేత దీనికి ఓ కారణంగా చెప్పొచ్చు. ఆహారం దొరక్కపోవడం, నీళ్లు లేకపోవడం కూడా కారణం అవుతోంది. అడవుల్లో ఉండాల్సిన క్రూర, వన్య మృగాలు ప్రజల మధ్యలోకి వచ్చేస్తున్నాయి. అదే సమయంలో పలువురిపై దాడి చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీస్తున్నాయి.

తాజాగా దారితప్పిన ఓ సింహం నగరంలోకి వచ్చింది. అదే సమయంలో అటుగా జాగింగ్ చేస్తూ వచ్చిన మహిళను చూసి సింహం భయపడింది. వెంటనే పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లి దాక్కుంది. అక్కడ సింహం ఉన్న విషయం ఆ మహిళకు అస్సలు తెలియదు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో చూసి నెటిజన్లు వామ్మో అనుకుంటున్నారు. సింహం భయపడి దాక్కోవడంతో సరిపోయింది కానీ, ఒకవేళ ఆమెపై దాడి చేసుంటే.. వామ్మో.. తలుచుకుంటేనే గుండెలు జారిపోతున్నాయి అని కామెంట్స్ చేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సాధారణంగా.. మనిషిని చూడగానే.. క్రూరమృగాలు అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాయి. తమకు ఎక్కడ హాని చేస్తారో అనే భయంతో అవి దాడికి పాల్పడతాయి. అయితే, ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. మనిషి రాకను పసిగట్టిన ఆ సింహం.. దాడి చేయడం మాని.. వెంటనే పక్కనే ఉన్న పొదల్లో దాక్కుంది.

ఆ అడవి జంతువు ఉద్దేశపూర్వకంగా పారిపోయి దాక్కోవడం ద్వారా మహిళతో గొడవను నివారించిందని IFS అధికారి చెప్పారు. “అడవి జంతువులు చాలా సందర్భాలలో మానవులతో సంఘర్షణను నివారిస్తాయి. బెదిరింపులకు గురైనప్పుడు మాత్రమే స్పందిస్తాయి. సంఘర్షణను నివారించడానికి పర్వత సింహం మహిళకు కనిపించకుండా దాక్కుంది. ఇదో ఆసక్తికరమైన వీడియో” అని ఆ అధికారి ట్వీట్ చేశారు.