సరిహద్దు దేశాలపై నిత్యం దురాక్రమణకు పాల్పడే జిత్తులమారి చైనా ప్రత్యర్థి సైన్యంపై ఎప్పుడూ కఠిన వైఖరినే అవలంభిస్తుంది. ఐదు శతాబ్ధాలకు పైగా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుతున్న భారత సైనికులపై డ్రాగన్ ఆర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడింది. ఎలాంటి తుపాకులు ఉపయోగించకుండా.. ఇసుక రాడ్లు, మారణాయుధాలతో దాడి చేసి అత్యంత కాఠిన్యం ప్రదర్శించింది. భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వానా లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ ఘర్షణ అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా జరిగింది కాదని అక్కడ లభించిన ఆయుధాలను చూస్తే అర్థమవుతోంది.
ఇనుపరాడ్లతో రెడ్‌ఆర్మీ దాడి :
పొడవాటి ఇనుప కడ్డీలు. వాటికి చివరన ఇనుప చువ్వలతో వెల్డింగ్ చేశారు. బలమైన రాడ్లకు కొండీలు అమర్చారు. ఎందుకంటే.. వీటినే మన జవాన్లపై రెడ్‌ఆర్మీ ఉపయోగించింది. సోమవారం రాత్రి ఘర్షణ జరిగిందని చెబుతోన్న 14వ పాయింట్ దగ్గర.. ఈ రాడ్లతోనే భారత సైనికులపై రెడ్‌ఆర్మీ దాడికి పాల్పడింది. రాళ్లు, ముళ్లమేకులు, ఫెన్సింగ్ వైర్ చుట్టిన రాడ్లతో… భారత జవాన్లపై దాడి చేశారు. ఎలాంటి తుపాకులు ఉపయోగించకుండానే భారత సైనికులను గాయపర్చారు. ఈ రాడ్లతో దాడి చేయడం మూలంగానే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగినట్టుగా సైనిక వర్గాలు భావిస్తున్నాయి.
ఇనుపకడ్డీల ఫోటోలు విడుదల :
పొడవాటి ఇనుప కడ్డీలకు చివరన ఇనుప చువ్వలను వెల్డింగ్ చేసి ఉన్న ఫోటోలను ప్రముఖ రక్షణ రంగ నిపుణులు అజయ్ శుక్లా ట్విటర్‌లో పోస్టు చేశారు. గల్వాన్ ఘర్షణ జరిగిన ప్రాంతంలో భారత సైనికులు ఈ ఫోటోలు తీసినట్లు తెలిపారు. కర్నల్‌గా సేవలందించిన అజయ్ శుక్లా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్నో విషయాలను ఇదివరకు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడీ ఫోటోలను బయటపెట్టారు. భారత్‌పై రెడ్‌ఆర్మీ చేసింది సైనిక చర్యకాదని.. అది నేరపూరిత చర్యగా అభివర్ణించారు. అయితే ఇనుప చువ్వలు వెల్డింగ్ చేసి ఉన్న దృశ్యాలను చూస్తోంటే మాత్రం చైనా పక్కా ప్రణాళికతోనే భారతసైన్యంపై దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది.
భారత్‌ను దొంగదెబ్బ తీయాలనే.. :
చైనా దుస్సాహసాన్ని పసిగట్టలేక పోయిన భారత ఆర్మీ అదునుచూసి దొంగదెబ్బ తీసిన చైనా ఉద్దేశపూర్వకంగానే కయ్యానికి కాలుదువ్విన చైనా దుస్సాహసాన్ని భారత జవాన్లు పసిగట్టలేకపోయారు. గతకొంత కాలంగా సరిహద్దుల్లో గిల్లికజ్జాలు ఆడుతున్న రెడ్‌ఆర్మీ.. భారత్‌ను దొంగదెబ్బ తీయాలని అదునుచూసి ఘర్షకు దిగింది. దాడికి ఎలాంటి ప్రణాళికలు లేకపోయినప్పటికీ.. భారత ఆర్మీ చైనా బలగాలను బలంగా తిప్పికొట్టగలిగారు.
సరిహద్దు ఆక్రమణల దగ్గర ఆయుధాలు వాడొద్దని నిబంధనలు నిబంధనలు తుంగలో తొక్కిన చైనా వాస్తవానికి సరిహద్దుల దగ్గర ఎలాంటి అతిక్రమణ జరిగినా కూడా ఆయుధాలు వాడకూడదని కాల్పులు చేయకూడదని 1993, 1996 ఒప్పందాల్లో ఉంది. ఆ ఒప్పందాలను చైనా ఏ మాత్రం పట్టించుకోలేదు. యధేచ్చగా మనవారిపై ఇలాంటి ఇనుపరాడ్లతో దాడులు చేయడంతోనే ఇప్పటికీ మన సైనికులు వందమందివరకూ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు..