China New Rules For Celebrities : సెలబ్రిటీలకు చైనా కొత్త రూల్స్..ఉల్లంఘిస్తే బహిష్కరణే

ఇకపై సెలబ్రిటీలు సోషలో మీడియాలో సంపద గురించి, విలాసాల గురించి గొప్పలు వెల్లడించకుండా చైనా నిషేధించింది. ఈ మేరకు తాజాగా చైనా సైబర్ స్పేస్ రెగ్యులేటర్-సైబర్​ స్పేస్ అడ్మినిస్ట్రేషన్​

China New Rules For Celebrities  ఇకపై సెలబ్రిటీలు సోషలో మీడియాలో సంపద గురించి, విలాసాల గురించి గొప్పలు వెల్లడించకుండా చైనా నిషేధించింది. ఈ మేరకు తాజాగా చైనా సైబర్ స్పేస్ రెగ్యులేటర్-సైబర్​ స్పేస్ అడ్మినిస్ట్రేషన్​ ఆఫ్ చైనా కొత్త నిబంధనలతో ఓ సర్య్యులర్ విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం..చైనాలో సెలబ్రిటీలు తప్పుడు, వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయరాదు. ఇతర ఫ్యాన్స్ గ్రూప్​లను రెచ్చగొట్టకూడదు. విపరీత ఆనందాన్ని కూడా వ్యక్తపరచకూడదు. వదంతులను అస్సలు వ్యాప్తి చేయరాదు.

ప్రముఖులు, వారి అభిమానులు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించి తీరాలి. అయితే ఈ రూల్స్ ఉల్లంఘించిన లేదా సామాజిక నైతికత కోడ్‌లను ఉల్లంఘించిన ప్రముఖులు “ఇంటర్నెట్ బహిష్కరణ”కు గురవుతారని సర్క్యులర్ చెబుతుంది. అయితే ఇది ఎలా అమలు చేయబడుతుందనే దాని గురించి లేదా ఎవరి ద్వారా అమలుచేయబడుతుంది అనే వివరాలు విడుదల కాలేదు. ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీపై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు, సెలబ్రిటీ సంప్రదాయానికి చెక్​ పెట్టేందుకే చైనా ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

కాగా,  సెలబ్రిటీ సంస్కృతి, సంపాదించాలనే అత్యాశ పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రమాదర అంశమని, కమ్యూనిజానికి దీని వల్ల ముప్పు ఉందని చైనా భావిస్తోంది. ఇవి సామూహికవాదాన్ని కాకుండా వ్యక్తిగతవాదాన్ని ప్రోత్సహిస్తాయని బలంగా విశ్వసిస్తోంది. అందుకే ప్రముఖుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. అసభ్యంగా ప్రవర్తించే సెలబ్రిటీలు పేరుతో ఆగస్టులో చైనా కొంతమందిని బ్లాక్​ లిస్టులో చేర్చిందని ప్రచారం కూడా జరిగింది. ఝావ్​, జెంగ్​ అనే అనే ఇద్దరు ప్రముఖుల పేర్లు ఇందులో ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చ సాగింది. రేప్​ కేసులో అరెస్టయిన చైనీస్​-కెనడియన్ పాప్ స్టార్​ క్రిస్​ వు పేరు కూడా ఇందులో ఉందని సమాచారం.

ఇక,ఈ ఏడాది సెప్టెంబర్​లో వినోద పరిశ్రమ సదస్సును నిర్వహించిన చైనా కమ్యూనిస్టు పార్టీ… ధనారాధన, మితిమీరిన వ్యక్తిగతవాదం, సుఖవాదం వంటి వాటిని సెలబ్రిటీలు కచ్చితంగా వ్యతిరేకించాలని హెచ్చరించింది. “పార్టీని ప్రేమించండి, దేశాన్ని ప్రేమించండి, నైతికత, కళను సమర్థించండి” అనే నినాదాన్ని లేవనెత్తింది. సామాజిక విలువలు, వ్యక్తిగత నైతికత, కుటుంబ విలువలకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని చెప్పింది.

ALSO READ Submerged Village : 30ఏళ్లుగా నీటిలోనే ఆ గ్రామం.. ఇన్నాళ్లకు బయటకు తేలింది!

ట్రెండింగ్ వార్తలు