New Covid-19 Subvariant JN.1 : చైనాలో మళ్లీ కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1

చైనా దేశంలో మళ్లీ కరోనా కొత్త మహమ్మారి ప్రబలుతోంది. చైనాలో కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతుందని ఆ దేశ జాతీయ వ్యాధి నియంత్రణ నివారణ పరిపాలనా శాఖ అధికారులు చెప్పారు.....

New Covid-19 Subvariant JN.1

New Covid-19 Subvariant JN.1 : చైనా దేశంలో మళ్లీ కరోనా కొత్త మహమ్మారి ప్రబలుతోంది. చైనాలో కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతుందని ఆ దేశ జాతీయ వ్యాధి నియంత్రణ నివారణ పరిపాలనా శాఖ అధికారులు చెప్పారు. ఈ కరోనా కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1కు సంబంధించి ఏడు కేసులు వెలుగుచూశాయని చైనా వైద్యాధికారులు చెప్పారు. ఈ కొత్త వేరియంట్ వ్యాప్తితో చైనాలోని బీజింగ్ నగరంలో ప్రజలు భయంతో మళ్లీ మాస్కులు ధరిస్తున్నారు.

ALSO READ : Parliament Election : పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రధాన పార్టీల సమాయత్తం

ఈ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి పెరగవచ్చని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. కొవిడ్ జేఎన్ 1కు బీఏ 2.86 సబ్ వేరియంట్ లకు దగ్గరి సంబంధం ఉందని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. స్పైక్ ప్రోటీన్‌లో జేఎన్.1,బీఏ.2.86 మధ్య ఒకే ఒక్క మార్పు ఉందని వైద్యాధికారులు చెప్పారు. జేఎన్1 సబ్ వేరియంట్ మొదటిసారి యునైటెడ్ స్టేట్స్ లో కనుగొన్నారు. కొత్త కరోనావైరస్ వేరియంట్ మొదటిసారిగా డిసెంబర్ 13వతేదీన కేరళ రాష్ట్రంలో కనుగొన్నారు.

ALSO READ : World’s Largest Office Building : గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన సూరత్ వజ్రాల భవనం…రేపు మోదీ ప్రారంభోత్సవం

భారతదేశంలోనూ ఇటీవల కొవిడ్ కేసుల సంఖ్య 1296కు చేరడానికి జేఎన్ 1 కారణమని నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కో-ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ చెప్పారు. జేఎన్ 1 సబ్ వేరియంట్ ప్రజారోగ్యానికి ఎక్కువ ప్రమాదం కలిగిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వైద్యాధికారులు చెబుతున్నారు.