కరోనా ఎఫెక్ట్ : 90శాతం పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
కరోనా వైరస్(coronavirus).. చైనాలోని వూహాన్(wuhan) నగరంలో పుట్టిన ఈ వైరస్.. చైనానే కాదు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

కరోనా వైరస్(coronavirus).. చైనాలోని వూహాన్(wuhan) నగరంలో పుట్టిన ఈ వైరస్.. చైనానే కాదు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
కరోనా వైరస్(coronavirus).. చైనాలోని వూహాన్(wuhan) నగరంలో పుట్టిన ఈ వైరస్.. చైనానే కాదు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ సోకిన కొన్ని రోజుల్లోనే మనిషి చనిపోతున్నాడు. అనేక దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించింది. వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. కాగా, ఇప్పటివరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కోలేకపోయారు. దీంతో అందరూ ఆందోళన చెందుతున్నారు.
కాగా కరోనా వైరస్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చైనా ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీసింది. బిజినెస్ డౌన్ అయ్యింది. పర్యాటక రంగంపై కరోనా ఎఫెక్ట్ మామూలుగా లేదు. చైనాకు వెళ్లే పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. టూరిజం ద్వారి వచ్చే ఆదాయం పోయింది. కాగా, రియల్ ఎస్టేట్ రంగంపైనా కరోనా వైరస్ ప్రభావం చూపింది. చైనాలో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఏకంగా 90శాతం సేల్స్ డౌన్ అయ్యాయి.
2019లో ఫిబ్రవరితో పోలిస్తే.. 2020 ఫిబ్రవరిలో కొత్త అపార్ట్ మెంట్ సేల్స్ 90శాతం పడిపోయాయని చైనా మర్చెంట్స్ సెక్యూరిటీస్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. చైనాలోని 36 నగరాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. 2003లో సార్స్(SARS) వచ్చినప్పుడు ఇళ్ల అమ్మకాలపై చూపిన ప్రభావం కన్నా.. కరోనా వైరస్ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉందన్నారు. ఇప్పటికే చైనాలో ప్రాపర్టీ మార్కెట్ సంక్షోభంలో ఉంది. తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కోంటోంది. ఈ సమయంలో కరోనా వైరస్ మరింత దెబ్బకొట్టిందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాపోయారు.
మ్యానుఫ్యాక్చరింగ్, ఫైనాన్షియల్, రిటైల్ కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఈ వారంలో తిరిగి విధుల్లోకి వచ్చారు. ప్రాపర్టీ మార్కెట్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అపార్ట్ మెంట్లు కొనేందుకు వచ్చి వారి సంఖ్య తక్కువగా ఉంది. కరోనా వైరస్ భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో అమ్మకాలు పడిపోయాయి. కాగా, కొందరు ఆన్ లైన్ లో అపార్ట్ మెంట్లు కొంటున్నారు. అలాంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. షెంజన్(shenzhen) లో కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. దీంతో ఇక్కడ ఇళ్ల అమ్మకాలపై నిషేధం విధించారు. ఇక హెనాన్ ఫ్రావిన్స్ లోని జెంగ్ జో(zhengzhou) నగరంలో ఏకంగా ఇళ్ల నిర్మాణాలపైనే నిషేధం విధించారు. మార్చి వరకు ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని ఆదేశాలిచ్చారు.
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు.. చాలా నగరాల్లో ఎవరూ లోపలికి రాకుండా బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. కరోనా వైరస్ కారణంగా కొందరికి పనులు కూడా దొరకడం లేదు. దీంతో ఆదాయం లేక పూట గడవడం కూడా కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఇల్లు ఏం కొంటారని వ్యాపారులు అంటున్నారు. కాగా, ఏప్రిల్ నుంచి పరిస్థితిలో మార్పు రావొచ్చని, మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇళ్ల అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.