China Typhoons : చైనాలో పలు టైఫూన్స్ ముప్పు…భారీవర్షాలు, వరదలు

చైనా దేశంలో ఆగస్టు నెలలో పలు టైఫూన్లు తాకే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. చైనాలో భారీ వర్షాల మధ్య, ఉత్తర. దక్షిణ చైనాలోని పలు ప్రాంతాల్లో ఆగస్టులో రెండు లేదా మూడు టైఫూన్‌లు దేశవ్యాప్తంగా తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు....

China Typhoons : చైనాలో పలు టైఫూన్స్ ముప్పు…భారీవర్షాలు, వరదలు

China Typhoons

China Typhoons : చైనా దేశంలో ఆగస్టు నెలలో పలు టైఫూన్లు తాకే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. చైనాలో భారీ వర్షాల మధ్య, ఉత్తర. దక్షిణ చైనాలోని పలు ప్రాంతాల్లో ఆగస్టులో రెండు లేదా మూడు టైఫూన్‌లు దేశవ్యాప్తంగా తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. (China Likely To Face Multiple Typhoons) డోక్సూరి టైఫూన్ వల్ల బీజింగ్, హెబీ ప్రావిన్సు ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడం వల్ల వరదలు వెల్లువెత్తాయి.

Seema Haider : సినిమాలో నటించనున్న సీమా హైదర్…రా ఏజెంటుగా పాత్ర

చైనాలో వరదల వల్ల 20 మంది మరణించారు. బీజింగ్ నగరంలో వరదల్లో విధి నిర్వహణలో ఉన్న 11మంది అధికారులు మృత్యువాత పడ్డారు. వరదల్లో మరో 13 మంది గల్లంతు అయ్యారు. యాంగ్జీ నది వరదల సందర్భంగా చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వశాఖ, అత్యవసర నిర్వహణ మంత్రిత్వశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. (In August Amid Heavy Rains) అధిక వర్షపాతంతో చైనాలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Cough Syrup : దగ్గుమందు ఉత్పత్తిపై నిషేధాస్త్రం

యాంగ్జీ నది ఎగువ ప్రాంతాలు, పోయాంగ్ సరస్సు, పసుపు నది ఎగువ ప్రాంతాలు, సాంగ్హువా నది నిర్దేశిత హెచ్చరిక స్థాయిలను మించి వరదలు వచ్చే అవకాశం ఉంది. ప్రాంతీయ తుపాన్లు, వరదలు హువైహే, తైహు సరస్సు, జుజియాంగ్ నది,హైనాన్ ద్వీపంలోని నదుల్లో వరదనీరు పొంగి ప్రవహించవచ్చని అధికారులు చెప్పారు. రెండు నుంచి మూడు టైఫూన్లు ల్యాండ్ ఫాల్ లేదా దేశవ్యాప్తంగా వాతావరణ వ్యవస్థలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.