Skipping Effect : ఎత్తు పెరగాలని 13 ఏళ్ల కూతురితోరోజుకు 3వేల స్కిప్పింగ్‌లు చేయించిన తల్లి..చివరికి పాపం
ఎత్తు పెరగాలని రోజుకు 13 ఏళ్ల కూతురితో తల్లి రోజుకు 3వేల స్కిప్పింగ్‌లు చేయించేది. దీంతో పాపం ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై..

Skipping Effect At 13 Years Girl
Mother Forced Her Daughter To Do 3000 Skipping : తన 13 ఏళ్ల కూతురు ఎత్తు పెరగాలని ఆ తల్లి చేయించిన పనికి పాపం ఆ చిన్నారి పరిస్థితి దారుణంగా తయారైంది. కాళ్లు నొప్పులొస్తున్నాయమ్మా..స్కిప్పింగ్ చేయలేనని ఏడ్చినా వినేదికాదు ఆ తల్లి. అలా 120 కేజీల బరువున్న కూతురితో దగ్గరుండి మరీ రోజుకు 3,000 స్కిప్పింగులు చేయించేది. అలా వరుసగా ఒక్కరోజు కూడా మానకుండా మూడు నెలల పాటు చేయించింది. దీంతో పాపంతీవ్ర అస్వస్థతకు గురైంది.
Read more : Surat : చావు ఎలా వస్తుందో తెలియదు..కుప్పకూలిన యువకుడు, వీడియో వైరల్
చైనాలోని జెన్‌జియాంగ్ ప్రావిన్స్‌కి చెందిన ఓ మహిళకు యువాన్ 13 ఏళ్ల కూతురు ఉంది. యువాన్ ఎత్తు 1.58 మీటర్లు. బరువు 120 కేజీలు. ఎక్సర్‌సైజుల ద్వారా ఆమె బరువును తగ్గించి ఎత్తు పెంచాలని తల్లి నిర్ణయించుకుంది. కానీ నిపుణులను సంప్రదించకుండానే తన సొంత ఆలోచనలతో కూతురితో రోజు స్కిప్పింగ్ చేయించేది. స్కిప్పింగ్ చేయటానికి టైమ్ టేబుల్ కూడా వేసింది. ఆమె సొంత షెడ్యూల్ ప్రకారం యువాన్ రోజుకు వెయ్యి స్కిప్స్ చేయించేది. అలా రోజులు గడిచేకొద్దీ సంఖ్య పెంచేసింది.అలా రోజుకు 3,000 స్కిప్స్ చేయించేది. అమ్మా కాళ్లు నొప్పులు..చేయలేనని ఏడ్చినా ఊరుకునేది కాదు. పోరు పెట్టి..తిట్టి కొట్టి అలా రోజుకు మూడు వేల చొప్పున మూడు నెలలపాటు చేయిచింది.
Read more : ఆ ఇష్టమే Puneeth Rajkumar ప్రాణం తీసిందా? మృతికి అసలు కారణం అదేనా?
దీంతో బాలిక మోకాళ్ల నొప్పి వస్తుందని ఏడ్చేది. స్కిప్పింగ్ చేయాలని కూతురు సాకులు చెబుతోందని అనుకుందామె. కానీ పాపం యువాన్ కు మొకాళ్ల నొప్పులు తీవ్రమయ్యాయి. నడవలేకపోయేది. దీంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లిందామె. బాలికను పరీక్షించిన డాక్టర్ ‘ట్రాక్షన్ అపొఫిసైటిస్’ అనే కీళ్ల సమస్య వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా ఆ తల్లిని ఎడాపెడా తిట్టిపారేసారు డాక్టర్లు. వ్యాయామం ఎక్కువ చేస్తే ఎంత ప్రమాదమో చెప్పారు. ఒకవేళ వ్యాయామం చేయాలనుకుంటే నిపుణులను సంప్రదించాలని సొంత ఆలోచనలు ఇటువంటిసమస్యలే వస్తాయని చీవాట్లు పెట్టారు. బరువుతగ్గడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయని సూచించారు. పిల్లలకు వ్యాయామంతోపాటు సరైన నిద్ర, పోషకాహారం, మానసిక స్థితి వంటి విషయాలపై శ్రద్ధ వహించాలని మిడిమిడి జ్నానంతో ఇలా ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని సూచించారు.