China Soldiers : సరిహద్దుల్లో చలికి వణికిపోతున్న చైనా ఆర్మీ!
గతేడాది ప్రారంభంలోనే తూర్పు లడఖ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున సైనికులను మొహరించిన చైనా..గల్వాన్ ఘర్షణల అనంతరం మరింత మంది సైనికులను అక్కడ మోహరించింది.

China Rotates 90 Perent Troops Deployed Along Ladakh Sector On India Border
China Soldiers గతేడాది ప్రారంభంలోనే తూర్పు లడఖ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున సైనికులను మొహరించిన చైనా..గల్వాన్ ఘర్షణల అనంతరం మరింత మంది సైనికులను అక్కడ మోహరించింది. గతేడాది ఏప్రిల్-మే మధ్యకాలంలో చైనా తూర్పు లడఖ్ లో 50,000మంది పైగా సైనికులను చైనా మొహరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే అక్కడి కఠిన వాతావరణం ధాటికి చైనా సైనికులు నానా అవస్థలు పడుతున్నారని.. తీవ్రమైన చలి, భయపెట్టే వాతవరణంలో విధులు కొనసాగించలేక ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి.
దీంతో చైనా సైనిక ఉన్నతాధికారులు..తూర్పు లడఖ్ లో ఏడాది కాలంగా విధులు నిర్వహిస్తున్న 90శాతం మంది తమ సైనికులను వెనక్కు రప్పించి వారి స్థానంలో కొత్త వారిని అక్కడికి పంపించినట్లు సమాచారం. కొత్త సైనికులను టిబెట్‌కు ఆవల ఉన్న సైనిక స్థావరాలను రప్పిస్తున్నట్లు సమాచారం. లడఖ్ లోని కఠిన వాతావరణ ప్రభావం చైనా సైనికులపై పడిందని, వారిలో అనేక మంది తీవ్రమైన గాయాలైన విషయాన్ని భారత సైన్యం గుర్తించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
సరిహద్దు వద్ద విధుల నిర్వహిస్తున్న సైనికులను కొంత కాలం తరువాత వెనక్కు రప్పించి వారి స్థానంలో కొత్త వారిని పంపిస్తుడం కొత్తేమీ కాదు. దీన్ని సైనిక పరిభాషలో రొటేషన్ అంటారు. సైనికులకు సెలవులు ఇవ్వడంతో పాటూ ఆరోగ్య కారణాల రీత్యా ఈ రొటేషన్ జరపాల్సి ఉంటుంది. సిరహద్దు వద్ద ఉన్న భారత సైనికుల విషయంలో ఇంతే. అయితే.. ఇందులో భాగంగా కేవలం 40 -45 శాతం మందిని మాత్రమే సైనిక ఉన్నతాధికారులు వెనక్కు పిలుపిస్తుంటారు. లడఖ్ ప్రాంతంలో రెండెళ్ల పాటు కొనసాగాలన్న నిబంధనే ఇందుకు ఓ కారణమని సమాచారం. అక్కడి కఠిన వాతావరణంలో విధులు నిర్వర్తించేందుకు భారత్ సైనికులు అలవాటు పడి ఉండటంతో చైనా స్థాయిలో రోటేషన్ జరగదని విశ్లేషకులు చెబుతున్నారు.
గతేడాది తూర్పు లడఖ్ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ తరువాత జరిగిన శాంతి చర్చలు కారణంగా పరిస్థితి కొంత మేర అదుపులోకి వచ్చినప్పటికీ ఇరు దేశాల సైనికులు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. ఇక భారత్ ఆర్మీ చీఫ్ తరచూ తూర్పు లద్దాఖ్ పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పరిస్థితిని బట్టి సైన్యానికి అక్కడిక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నారు.