Olympics Ban : ఒలింపిక్స్ బహిష్కరించడంపై చైనా ఆగ్రహం…అమెరికాకు తగిన రీతిలో బదులిస్తాం

ఒలింపిక్స్ ను అమెరికా..దాని మిత్రదేశాలు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వెల్లడించారు. చేసిన తప్పులకు ఆ దేశాలు మూల్యం...

Olympics Ban : ఒలింపిక్స్ బహిష్కరించడంపై చైనా ఆగ్రహం…అమెరికాకు తగిన రీతిలో బదులిస్తాం

Beijing 2020

Updated On : December 10, 2021 / 1:42 PM IST

China Olympics Ban : ఒలింపిక్స్ ను బహిష్కరించిన దేశాలపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒలింపిక్స్ ను అమెరికా..దాని మిత్రదేశాలు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వెల్లడించారు. చేసిన తప్పులకు ఆ దేశాలు మూల్యం చెల్లించకోక తప్పదని తెలిపారు. వచ్చే సంవత్సరం బీజింగ్ వేదికగా ఫిబ్రవరి 04వ తేదీన ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 20వ తేదీన ఈ క్రీడలు ముగియనున్నాయి. అయితే…అమెరికా, యూకేతో సహా పలు దేశాలు దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.

Read More : Omicron Variant: వ్యాక్సిన్ మూడో డోస్ తీసుకున్నా ఒమిక్రాన్ సోకింది

అథ్లెట్లను పంపుతాం గాని..తమ దేశాల తరపున దౌత్య ప్రతినిధులను పంపించేది లేదని స్పష్టం చేశాయి. దీనిపై చైనా స్పందించింది. ఆయా దేశాల బహిష్కరణతో తమకేం ఆందోళన లేదని, ప్రపంచంలోని పలు దేశాలు బీజింగ్ ఒలింపిక్స్ కు మద్దతుగా నిలుస్తున్నాయనే విషయాన్ని గుర్తు చేసింది. దేశాధినేతలు, రాజ కుటుంబీకులు ఒలింపిక్స్ వేడుకలకు హాజరు కానున్నారని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ తెలిపారు.

Read More : Gen Bipin Rawat : రావత్‌‌కు నివాళి..50 కి.మీటర్ల మేర బారులు తీరిన ప్రజలు

చేసిన తప్పులకు ఆ దేశాలు మూల్యం చెల్లించకతప్పదని, దౌత్యపరమైన బహిష్కరణ చేసినందుకు గాను…అమెరికాకు తగిన రీతిలో బదులిస్తామని వార్నింగ్ ఇచ్చింది. వారి ప్రభావం ఏ మాత్రం ఒలింపిక్స్ నిర్వహణపై ఉండదని స్పష్టం చేసింది. ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బ్రిటన్, కెనాడ దేశాలు బహిష్కరించాయి. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రకటించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరగుతుందన్న కారణంగా విశ్వక్రీడలను బహిష్కరించాలనుకుంటున్నట్లు తెలిపారు. జపాన్, న్యూజిలాండ్‌ దేశాలు కూడా చైనా ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.