China Stealth Fighter Jet : చైనా స్వదేశీ 3వ విమాన వాహక నౌకలో జే-35 స్టీల్త్ ఫైటర్ జెట్‌ పరీక్షిస్తోంది..!

China Stealth Fighter Jet : చైనా 3వ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ 'ఫుజియాన్'లో మోహరించేందుకు జే-35 అనే కొత్త స్టెల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను పరీక్షిస్తోంది. చైనా తర్వాతి జనరేషన్ క్యారియర్-బోర్న్ స్టెల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కావచ్చునని భావిస్తున్నారు.

China Stealth Fighter Jet : చైనా స్వదేశీ 3వ విమాన వాహక నౌకలో జే-35 స్టీల్త్ ఫైటర్ జెట్‌ పరీక్షిస్తోంది..!

China testing stealth fighter jet for its 3rd aircraft carrier

Updated On : September 15, 2024 / 11:46 PM IST

China Testing Stealth Fighter Jet : కయ్యాలమారి చైనా మళ్లీ కవ్వింవు చర్యలకు కాలుదువ్వేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చైనా మూడో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ‘ఫుజియాన్’లో మోహరించేందుకు జే-35 అనే కొత్త స్టెల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను పరీక్షిస్తోంది. ఈ ఫైటర్ జెట్ స్కీ-జంప్ టేకాఫ్ ర్యాంప్‌లతో అమర్చిన రెండు నౌకల కన్నా భిన్నమైన సాంకేతికతను కలిగి ఉంది.

Read Also : iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్‌లో కెమెరా కంట్రోల్ బటన్.. ఫొటోలు, వీడియోలతో కొత్త ప్రపంచాన్ని సృష్టించవచ్చు..!

ఇందులో ఫుజియాన్ విద్యుదయస్కాంత కాటాపుల్ట్ వ్యవస్థను కలిగి ఉంది. జే-35 చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) నావికాదళానికి చెందిన మొదటి విమాన వాహక నౌక కాగా, లియానింగ్‌లో ఈ ఏడాదిలో మొదటిసారి పరీక్షించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్లోబల్ టైమ్స్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీని ఉటంకిస్తూ పేర్కొంది. ఈ కొత్త (J-35) విమానం చైనా తర్వాతి జనరేషన్ క్యారియర్-బోర్న్ స్టెల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కావచ్చునని భావిస్తున్నారు.

‘ఫుజియాన్’ బరువు 80 వేల టన్నులు :
చైనాలో ప్రస్తుతం రెండు విమాన వాహక నౌకలు ఉన్నాయి. సోవియట్ కాలం నాటి ఓడ లియానింగ్ రీఫిట్ అయింది. 2019లో దేశీయంగా నిర్మించిన 2వ విమాన వాహక నౌక ‘షాన్‌డాంగ్’ ఇది. మూడో విమాన వాహక నౌక ‘ఫుజియాన్’ రెండు నౌకల కన్నా పెద్దది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. దీని బరువు 80వేల టన్నులు. ఇది పూర్తిగా స్వదేశీంగా అభివృద్ధి చేసి నిర్మించిన మొదటి విమాన వాహక నౌక. యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ అనే అమెరికన్ నౌకను కలిగి ఉంది. ఫోర్డ్ మాదిరిగానే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ (EMALS) కలిగి ఉంది.

చైనా ఇతర రెండు విమాన వాహక నౌకలు స్కీ-జంప్ టేకాఫ్ ర్యాంప్‌లతో అమర్చి ఉంటాయి. అయితే, ఫుజియాన్ ఫ్లాట్-టాప్ ఫ్లైట్ డెక్‌ను కలిగి ఉంది. చైనా తన వాహకాల కోసం స్వదేశీంగా నిర్మించిన జే-15 విమానాలను నడుపుతోంది. చైనా ఇప్పుడు కొత్త రకం క్యారియర్-బోర్న్ ఎయిర్‌క్రాఫ్ట్ సేవలకు సిద్ధంగా ఉందని సీసీటీవీ నివేదిక అధికారిక ధృవీకరణగా నిపుణులను ఉటంకిస్తూ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

జే-20 తర్వాత జే-35 ఫైటర్ జెట్ :
ఈ కొత్త యుద్ధ విమానం చైనాకు చెందిన మూడో విమాన వాహక నౌక ఫుజియాన్‌లో మాత్రమే కాకుండా, మునుపటి రెండు వాహక నౌకలైన ర్యాంప్‌తో కూడిన లియోనింగ్, షాన్‌డాంగ్‌లలో కూడా పనిచేస్తుందని నివేదిక ధృవీకరించిందని నిపుణులు తెలిపారు. చైనా విమాన వాహక నౌకల సామర్థ్యాలను గణనీయంగా పెంచుతాయి.

జే-20ని అనుసరించి చైనా రెండో ఐదవ జనరేషన్ ఫైటర్ జెట్‌గా జే-35ని షెన్యాంగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తోందని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వార్తాపత్రిక పేర్కొంది. సింగపూర్‌కు చెందిన ఎస్. రాజరత్నం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో నిపుణుడు కోలిన్ కోహ్ మాట్లాడుతూ.. పీఎల్ఏ సామర్థ్యాలను పరీక్షించడానికి లియానింగ్ విమాన వాహక నౌకను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు జే-35 యుద్ధ విమానాన్ని చైనా పరీక్షిస్తోంది.

Read Also : iOS 18 Update : ఐఫోన్ 18 అప్‌డేట్ వచ్చేస్తోంది.. ఈ నెల 16నే రిలీజ్.. ఏయే ఫీచర్లు, ఏ ఐఫోన్లలో సపోర్టు చేస్తుందంటే?