ప్రస్తుతం ప్రపంచదేశాలన్నింటినీ వణికిస్తున్న కరోనా మహమ్మారి తొలిసారిగా గతేడాది డిసెంబర్ లో చైనాలోని వూహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన వూహాన్ లో కొత్త కేసులు,మరణాలు లేవంటూ నిన్న మొన్నటివరకు చైనా చెబుతూ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కరోనా కట్టడిచేయడంలో చైనా పెద్ద విజయం సాధించిందంటూ చాలామంది విశ్లేషణలు కూడా చేశారు. అంతేకాకుండా వూహాన్ లో ఈ ఏడాది జనవరిలో విధించిన ఆంక్షలను ఏప్రిల్-8న ఎత్తివేయడం కూడా అందరినీ చైనా పెద్ద విజయమే సాధించిందని అని అనుకునేలా చేసిందనడంలో సందేహం లేదు.
అయితే ఇక్కడ వాస్తవమేమిటంటే చైనాలో ప్రతి ఒక్కటి ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. అది మీడియా అయినా సరే. కమ్యూనిస్టు ప్రభుత్వం కనుసన్నల్లోనే అక్కడ మీడియా పనిచేస్తుంటదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జిన్ పింగ్ ప్రభుత్వం ఏం చెబితే అది వినడమే తప్ప బయటి ప్రపంచానికి వేరే మార్గం లేదు. నిన్నటివరకు కొత్త కరోనా కేసులు మరణాలు లేవంటూ ఊదరగొట్టి,ప్రపంచదేశాలన్ని ఆర్థికసంక్షోభంలో మనిగిపోతుంటే, అమెరికాను మించి తిరుగులేని శక్తిగా అడుగులు వేస్తున్న చైనా నుంచి ఇప్పుడు ఓ ముఖ్యమైన విషయం బయటిప్రపంచానికి తెలిపింది.
వూహాన్ లో కరోనా కేసులు మరణాల సంఖ్యలను శుక్రవారం(ఏప్రిల్-17,2020) చైనా సవరించింది. వూహాన్ లో గతంలో ఉన్న కరోనా మరణాల సంఖ్య,కేసుల సంఖ్య ను పెంచి చూపించింది. వూహాన్ లో కరోనా మరణాలను 1290పెంచగా, కేసుల సంఖ్య 350 పెంచింది. దీంతో వూహాన్ లో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 3,689కు చేరుకుందని అధికారులు తెలిపారు. 325 కరోనా కేసుల పెరుగుదలతో0 ఈ సిటీలో ఇప్పటివరకు కేసుల సంఖ్య 50,333కి చేరుకుంది. వైరస్ వ్యాప్తి ప్రారంభరోజుల్లో తమతమ ఇళ్లల్లో చినిపోయినవారిని, హాస్పిట్స్ నుంచి సరిగా రిపోర్ట్ చేయబడని మరణాలు లేదా డెత్ సర్టిఫికెట్స్ లో రిజిస్టర్ కానీ వాటిని కూడా పునరుద్దరించిన మరణాల సంఖ్యలో కలిపినట్లు వూహాన్ అధికారులు తెలిపారు.
అయితే ఇప్పుడు చర్య చైనా యొక్క అధికారిక సంఖ్యల ఖచ్చితత్వం గురించి పెరుగుతున్న ప్రశ్నలకు ప్రతిస్పందనగా కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంక్షోభంగా మారిన వైరస్ కు చైనా దేశాన్ని బాధ్యులుగా ఉంచాలని పిలుపునిచ్చింది. వైరస్ ఎలా వచ్చిందన్నదాని గురించి మరియు దాన్ని తొందరంగా ఎలా చైనా నిలువరించగలిగింది వంటి పలు కఠినమైన ప్రశ్నలకు సంక్షోభం తర్వాత చైనా సమాధానం చెప్పాల్సిందేనని బ్రిటీష్ ఫారిన్ సెక్రటరీ డొమినిక్ రాబ్ అన్నారు. మరోవైపు కరోనాను చైనానే సృష్టించిందని,దీనిపై ఓ విచారణకు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు.