Paid Leave Lucky Draw : లక్కీ డ్రాలో 365 రోజులు పెయిడ్ లీవ్ గెలుచుకున్న ఉద్యోగి.. ఎక్కడంటే?
పెయిడ్ లీవ్ లక్కీ డ్రా .. ఎప్పుడైనా విన్నారా? 365 రోజుల వేతనంతో కూడిన సెలవు.. ఓ ఉద్యోగి గెలుచుకున్నాడు. కంపెనీ తీసిన లక్కీ డ్రాలో గెలిచి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇంతకీ అదెక్కడా అంటే..

Paid Leave Lucky Draw
Paid Leave Lucky Draw : ఎవరైనా లక్కీ డ్రాలో (Lucky draw) నగలు, డబ్బు, కారు, ఇల్లు గెలుచుకుంటారు.. కానీ ఓ ఉద్యోగి 365 రోజుల పెయిడ్ లీవ్ (paid leave) ను గెలుచుకున్నాడు. కంపెనీ ఇచ్చిన విందులో అనౌన్స్‌మెంట్ విని ఆ ఉద్యోగి షాకయ్యాడు.
corona effect : 2 ఏళ్ల తర్వాత కాఫీ స్మెల్ గుర్తుపట్టిన మహిళ ఎమోషనల్ వీడియో వైరల్
చైనాలోని (china) షెన్‌జెన్లో (shenzhen) ఓ కంపెనీ వార్షిక విందు (annual dinner) ఏర్పాటు చేసింది. అదీ కోవిడ్ కారణంగా మూడేళ్ల బ్రేక్ తర్వాత. ఈ విందులో లక్కీ డ్రా తీసారు. 365 రోజుల వేతనంతో కూడిన సెలవు.. దీనినే ఒక ఉద్యోగి గెలుచుకున్నాడు. లక్కీ డ్రా అనౌన్స్ చేయగానే ఆ ఉద్యోగి షాకయ్యాడు. ఒక సంవత్సరం మొత్తం అతను పని చేయకపోయినా జీతం చెల్లించేలా కంపెనీ తీసిన లక్కీ డ్రా అది. అలా రాసి ఇచ్చిన పెద్ద చెక్కును పట్టుకుని అతను ఫోటోకి పోజ్ ఇచ్చాడు. ఇక ఈ లక్కీ డ్రా ఎవరూ గెలవరని కంపెనీ బాస్ అనుకున్నాడట. విషయం తెలిసి షాకవ్వడం అతని వంతు అయ్యిందట.
ఇక ఈ డ్రా ఏప్రియల్ ఫూల్ (april fool) చేయడానికి అని కూడా కొందరు అనుకున్నారు. ఎవరినైనా తొలగించడానికి కంపెనీ బాస్ ఇలాంటివి చేస్తూ ఉంటారని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇది మెటర్నిటీ సెలవు లాంటిది అని కొందరు ఇలా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. గత ఏడాది షెన్ జెన్ లోని మరో కంపెనీకి చెందిన సేల్స్ ఎంప్లాయి కూడా ఇలాంటి లక్కీ డ్రా గెలుచుకున్నారట. మొత్తానికి లక్కీ డ్రా గెలుచుకున్న వ్యక్తి ఆనందానికి మాత్రం హద్దులు లేవు.
男子在公司年会抽到“365天带薪休假”奖项 pic.twitter.com/aOaSxgBAtO
— The Scarlet Flower (@niaoniaoqingya2) April 12, 2023