Chinese Spy: అమెరికా ఎఫ్‌బీఐకి దొరికిపోయిన చైనా గూఢచారికి 20 ఏళ్ల జైలు శిక్ష

అమెరికాలో ఉంటూ ఆ దేశ అంతరిక్ష, విమానయాన వాణిజ్య రహస్యాలను చైనాకు అందించేందుకు కుట్రపన్నిన ఓ గూఢచారికి యూఎస్ లోని ఓ ఫెడరల్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జు యంజున్ అనే చైనా పౌరుడు పాల్పడ్డ నేరాలకుగాను అతడిని 2021 నవంబరులో కోర్టు దోషిగా తేల్చింది. అతడికి నిన్న కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆర్థిక గూఢచర్యం, వాణిజ్య రహస్యాల చోరీ వంటి ప్రయత్నాలు చేస్తుండడం, కుట్రలు పన్నడం వంటి నేరాలకు అతడు పాల్పడ్డాడని చెప్పింది.

Chinese Spy: అమెరికా ఎఫ్‌బీఐకి దొరికిపోయిన చైనా గూఢచారికి 20 ఏళ్ల జైలు శిక్ష

Updated On : November 17, 2022 / 7:48 AM IST

Chinese Spy: అమెరికాలో ఉంటూ ఆ దేశ అంతరిక్ష, విమానయాన వాణిజ్య రహస్యాలను చైనాకు అందించేందుకు కుట్రపన్నిన ఓ గూఢచారికి యూఎస్ లోని ఓ ఫెడరల్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జు యంజున్ అనే చైనా పౌరుడు పాల్పడ్డ నేరాలకుగాను అతడిని 2021 నవంబరులో కోర్టు దోషిగా తేల్చింది. అతడికి నిన్న కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆర్థిక గూఢచర్యం, వాణిజ్య రహస్యాల చోరీ వంటి ప్రయత్నాలు చేస్తుండడం, కుట్రలు పన్నడం వంటి నేరాలకు అతడు పాల్పడ్డాడని చెప్పింది.

‘ఇటువంటి చర్యలకు పాల్పడడం ఎంతటి తీవ్రమైన నేరమో ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. అలాగే, అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉండే ఇటువంటి చర్యలపై న్యాయశాఖ ఎంతటి నిబద్ధతతో పనిచేస్తుందో మరోసారి రుజువైంది’ అని అమెరికా అటార్నీ జనరల్ మెర్రిక్ గార్గాండ్ ఓ ప్రకటనలో తెలిపారు. చైనా జాతీయ భద్రతకు చెందిన నిఘావర్గాల అధికారి అన్న ఆరోపణలపై జు యంజున్ ను బెల్జియంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు 2018లో అరెస్టు చేశారు.

అమెరికాకు చెందిన విమానయాన, అంతరిక్ష సంస్థలల నుంచి రహస్యాలు చోరీ చేయడమే లక్ష్యాలుగా 2013-2018 మధ్య అతడు పనిచేస్తూ మారు పేర్లతో తిరిగాడని అధికారులు గుర్తించారు. సమర్థంగా విచారణ ముగించారు. అతడికి పడిన శిక్షపై చైనా స్పందించలేదు. అమెరికాకు చెందిన రహస్యాలను తస్కరించడానికి ప్రయత్నిస్తూ చైనా తమ భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందని యూఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..