Teenage Girl : కూతురు చేసిన పనికి తల్లి షాక్.. ‘లిప్ స్టడ్స్’ కోసం కోట్ల నగలను కేవలం రూ.680కే అమ్మేసింది..!
Teenage Girl : షాంఘైలో ఒక టీనేజ్ అమ్మాయి తన తల్లికి చెందిన రూ. 1.16 కోట్ల విలువైన ఆభరణాలను కేవలం రూ.680కి అమ్మేసి లిప్ స్టడ్స్ కొనడంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

Chinese Teenage girl sells mother’s jewellery
Chinese Teenage girl : ప్రస్తుత రోజుల్లో బ్రాండెడ్ వస్తువులంటే ప్రతిఒక్కరూ ఇష్టపడతారు. వాటి కోసం తెగ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇలా డబ్బు ఖర్చుపెట్టడం కొత్తేమీ కాదు. బట్టలు, బూట్లు, ఫ్యాషన్ వంటి ఇతర వస్తువుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. అందుకు కారణం బ్రాండెడ్ వస్తువులు.
కానీ, ఇక్కడ ఓ చైనా యువతి కేవలం లిప్ స్టడ్స్ కోసం ఏకంగా 1.16 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ, ఆమె కొన్నదల్లా కేవలం రూ. 680 రూపాయల విలువైన లిప్ స్టడ్ మాత్రమే. తన కూతురు చేసిన పనికి ఆ తల్లి ఒక్కసారిగా షాకైంది. ఈ సంఘటన చైనాలోని షాంఘైలోని వాన్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. చైనాలోని షాంఘైలో ఒక టీనేజ్ అమ్మాయి తన తల్లికి చెందిన ఒక మిలియన్ యువాన్ల ( రూ. 1.16 కోట్లు) విలువైన ఆభరణాలను దొంగిలించి కేవలం 60 యువాన్లకు ( రూ. 680) అమ్మేసి లిప్ స్టడ్స్ (పోగులు) కొనుక్కుంది.
వాంగ్ అనే బాలిక తల్లి, పుటువో పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోలోని వాన్లి పోలీస్ స్టేషన్‌లో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వాంగ్ తన కుమార్తె, లి వాంగ్ తనకు తెలియకుండానే జేడ్ బ్రాస్‌లెట్‌లు, నెక్లెస్‌లు, జెమ్ స్టోన్ సహా అధిక విలువైన ఆభరణాలను దొంగిలించి ఆపై విక్రయించిందని తెలిపింది.
డబ్బులు అడిగితే ఇవ్వలేదని.. :
“ఆమె ఎందుకు అభరణాలను అమ్మాలనుకుంటుందో నాకు అర్థం కాలేదు” అని తల్లి వాంగ్ పోలీసులకు చెప్పింది. “ఆ రోజు తనకు డబ్బు అవసరమని నన్ను అడిగింది. నేను ఎంత అని అడిగినప్పుడు.. ఆమె నాకు ’60 యువాన్లు’ అని చెప్పింది. నేను ఎందుకు అని అడిగాను.. నేను లిప్ స్టడ్లు ఉన్న ఒకరిని చూశాను. చాలా బాగున్నాయి. నాకు కూడా అలాంటిది ఒకటి కావాలి’ అని చెప్పింది.
ఆ లిప్ స్టడ్ ధర 30 యువాన్లు ( రూ. 340) అని లీ చెప్పింది. ఆమె 30 యువాన్ల ధర గల మరో జత లిప్ స్టడ్స్ కావాలని అడిగింది. దాంతో మొత్తం 60 యువాన్లు కావాల్సి వచ్చింది. అయితే, అందుకు తల్లి అంగీకరించలేదు. ఎలాగైన వాటిని కొనాలని నిర్ణయించుకున్న యువతి తల్లి లేని సమయంలో ఇంట్లోని విలువైన ఆభరణాలను దొంగిలించి విక్రయించింది.
తాను మైనర్ కావడంతో ఈ బంగారు ఆభరణాలను ఎక్కడ అమ్మాలో తనకు తెలియలేదు. వాస్తవానికి తాను దొంగిలించింది నిజమైన బంగారు నగలు అని కూడా ఆమెకు తెలియదు. అది రోల్డ్ గోల్డ్ అని తెలుసుకుని రీసైక్లింగ్ షాపులో అమ్మేసింది. తల్లి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగతనం చేసింది ఎవరో గుర్తించారు. ఆ రీసైక్లింగ్ షాపును ట్రాక్ చేసి అమ్మేసిన అన్ని ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.