Best Mobile Phones : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ ఫిబ్రవరిలో రూ.35వేల లోపు ధరలో బెస్ట్ ఫోన్లు మీకోసం.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Best Mobile Phones : ఈ ఫిబ్రవరిలో భారత మార్కెట్లో మీరు రూ. 35వేల లోపు ధరలో కొనుగోలు చేయగల బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఓసారి లుక్కేయండి.

Best mobile phones
Best Mobile Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో మీ బడ్జెట్‌లో సరైన స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవడం కష్టమే. ముఖ్యంగా మార్కెట్లో చాలా ఫోన్లు అందుబాటులో ఉంటాయి. అందులో రూ. 35వేల లోపు ధరలో పవర్‌ఫుల్ ఫీచర్లతో కూడిన 5G ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే..
ఈ ఫోన్‌లు గ్రేట్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు.. పవర్‌ఫుల్ కెమెరాలు, లాంగ్ బ్యాటరీ లైఫ్, స్టైలిష్ డిజైన్‌లను వంటివి అందిస్తాయి. మీ బడ్జెట్‌కు తగినట్టుగా ఎంచుకోవచ్చు. ఈ జాబితాలో పోకో X7 ప్రో 5Gతో సహా మొత్తం నాలుగు టాప్ ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
Read Also : దేవుడా.. అమెరికా అడ్డదారిలో వెళ్లినోళ్ల కథలు.. దారిలో చావులు, పుర్రెలు.. ఒళ్లు గగుర్పొడిచే వ్యథలు చదివితే..
పోకో ఎక్స్ 7 ప్రో :
ఈ జాబితాలో పోకో X7 ప్రో 5జీ ఫోన్ రూ. 35వేల కన్నా తక్కువ ధరలో అద్భుతమైన ఫోన్. పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమన్షిటీ 8400 అల్ట్రా చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. బోర్డు అంతటా సున్నితమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. పవర్‌ఫుల్ కలర్స్, ఈజీ స్క్రోలింగ్‌ను అందిస్తుంది. ఇందులో భారీ 6,550mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
బ్యాటరీ లైఫ్ పరంగా బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. కెమెరా సెటప్‌లో OISతో కూడిన 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 20ఎంపీ ఫ్రంట్ షూటర్ ఉన్నాయి. వివిధ లైటింగ్ పరిస్థితులలో పవర్‌ఫుల్ ఫొటోలను అందిస్తుంది. అదనంగా, ఆకర్షణీయమైన డిజైన్, ఐపీ68/69 రేటింగ్, డ్యూయల్-స్టీరియో స్పీకర్లు, మూడు ఏళ్ల ఓఎస్ అప్‌డేట్స్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ఓఎస్ 2.0 వంటివి ఆకర్షణీయమైన ఫీచర్లుగా చెప్పవచ్చు.
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ :
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ 5జీ మరొక బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్ ధర రూ. 29,999 నుంచి ప్రారంభమవుతుంది. కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లే, స్ట్రాంగ్ గ్లాస్ బ్యాక్‌తో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. హుడ్ కింద, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 6.67-అంగుళాల అమోల్డ్ స్క్రీన్ ప్రకాశవంతంగా ఉంటుంది. 3,000 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో వస్తుంది.
ఈ ఫోన్ 6,200mAh బ్యాటరీతో రోజంతా ఛార్జింగ్ అందిస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కెమెరా ఫ్రంట్ సైడ్ మీరు OISతో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 50ఎంపీ టెలిఫోటో లెన్స్‌ను కలిగిన ట్రిపుల్-లెన్స్ సిస్టమ్‌ను అందిస్తుంది. మన్నిక విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ IP68 దుమ్ము, నీటి నిరోధకతతో కూడా వస్తుంది.
వివో T3 అల్ట్రా :
మీరు పర్ఫార్మెన్స్ పరంగా మంచి ఫోన్ కోసం చూస్తుంటే.. వివో T3 అల్ట్రా 5జీ ఫోన్ కొనేసుకోండి. కేవలం 192 గ్రాముల బరువు, 7.6mm మందం కలిగిన ఈ ఫోన్ గ్రిప్ చాలా ఈజీగా ఉంటుంది. ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ ఫోన్ 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక రోజు కన్నా ఎక్కువ సమయం ఛార్జింగ్ వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 9200 ప్లస్ చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది.
గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం వాడొచ్చు. 6.78-అంగుళాల కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లే మృదువైన 120Hz రిఫ్రెష్ రేట్‌తో పవర్‌ఫుల్ విజువల్స్‌ను అందిస్తుంది. ఫోటోగ్రఫీకి ఫ్రంట్ సైడ్ 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్921 ప్రైమరీ సెన్సార్‌తో మంచి షాట్‌లను క్యాప్చర్ చేయొచ్చు. మొత్తం మీద వివో టీ3 అల్ట్రా ఫోన్ ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంటాయి.
వన్‌ప్లస్ నార్డ్ 4 :
వన్‌ప్లస్ నార్డ్ 4 5జీ ఫోన్ రూ. 30వేల లోపు ధరలో బెస్ట్ ఫోన్. స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. వేగవంతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ 6.74-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. గేమింగ్, స్మూత్ స్క్రోలింగ్‌కు అద్భుతంగా పనిచేస్తుంది.
ప్రత్యేక ఫీచర్లలో మెటల్ యూనిబాడీ డిజైన్ ఒకటి. దీనికి ప్రీమియం టచ్ ఇస్తుంది. 5,500mAh బ్యాటరీ బ్లేజింగ్-ఫాస్ట్ 100W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ దాదాపు 30 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్ అవుతుంది. అంతేకాకుండా, వన్‌ప్లస్ 6 ఏళ్ల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా అందిస్తుంది.