బతికి ఉన్న ఆక్టోపస్‌ను తినబోయింది.. ఏమైందో చూడండి!

మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే ఆక్టోపస్ తో జోస్యం చెప్పించుకోవచ్చు పర్వాలేదు. అదే..ఆక్టోపస్ ను ఆరగించాలని ప్రయత్నిస్తే ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది.

  • Publish Date - May 9, 2019 / 07:58 AM IST

మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే ఆక్టోపస్ తో జోస్యం చెప్పించుకోవచ్చు పర్వాలేదు. అదే..ఆక్టోపస్ ను ఆరగించాలని ప్రయత్నిస్తే ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది.

మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే ఆక్టోపస్ తో జోస్యం చెప్పించుకోవచ్చు పర్వాలేదు. అదే..ఆక్టోపస్ ను ఆరగించాలని ప్రయత్నిస్తే ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.. చైనాకు చెందిన ఓ యువతి. బతికి ఉన్న ఆక్టోపస్ ను లైవ్ లో తినేందుకు ప్రయత్నించిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.

ఆక్టోపస్ తన తొండాలతో యువతి ముఖాన్ని గట్టిగా పట్టి పీకేసింది. ఆక్టోపస్ ఆమె ముక్కు, చెంపలను గట్టిగా పట్టేసుకుంది. దాన్ని వదిలించుకోలేక.. నొప్పి భరించలేక.. దాదాపు 50సెకన్ల పాటు యువతి అల్లాడిపోయింది. గట్టిగా కేకలు వేస్తూ ఆక్టోపస్ ను వదిలించుకునేందుకు పడరాని పాట్లు పడింది. 

చివరికి ఆక్టోపస్ ను అతికష్టం మీద వదిలించుకుంది. ఆక్టోపస్ తన చెంపపై చిన్న గాయం కూడా చేసింది. ఇదంతా లైవ్ స్ట్రీమింగ్ వీడియో తీసిన చైనా యువతి ఫొటో షేరింగ్ యాప్ లో షేర్ చేసింది. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం వెయిబోలో పోస్టు చేయగా వీడియో వైరల్ అయింది. 50 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. బతికి ఉన్న ఆక్టోపస్ ను తినేందుకు ప్రయత్నించిన యువతికి నెటిజన్లు చివాట్లు పెట్టారు.