Cobra bites Chef : కోబ్రా పగ..ముక్కలు ముక్కలుగా కోసినా..కాటేసి చంపేదాకా వదల్లేదు..!!
ఓ కోబ్రా..తనను చంపిన వ్యక్తిని కాటు వేసి చంపింది. తనను ముక్కలుగా కోసిన వ్యక్తిని చంపేదాకా వదల్లేదు. అంటే పాములు పగపట్టి చంపుతాయా?

Cobra Bites Chef (2)
Cobra bites Chef in china: నాగుపాము పగ 12 ఏళ్లు అంటారు. అసలు పాములు పగపడతాయా? పగపట్టి చంపుతాయా? అనేమాట పక్కన పెడితే..ఓ నాగుపాము మాత్రం తనను చంపిన మనిషిని తాను చచ్చిపోయాక కూడా కాటు వేసి కాని వదల్లేదు. అదేంటీ చచ్చిపోయిన పాము ఎలా కాటు వేస్తుంది? అనే డౌట్ రావచ్చు. కానీ పలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటిదే ఓ పాము తనను ముక్కలు ముక్కలుగా కోసేసినా గానీ వద్దల్లేదు. కాటు వేసి ప్రాణం తీసిన ఆశ్చర్యకర ఘటన దక్షిణ చైనాలో జరిగింది.చైనీయులు పాముల్ని కప్పల్ని తింటారనే విషయం తెలిసిందే. వీటిని చైనా వాసులు లొట్టలేసుకుని మరీ తింటారు. పాము చర్మంతో తయారు చేసే సూప్ ని చైనీయులు చాలా ఇష్టంగా ఆరగిస్తారు. ఈక్రమంలో ఓ దక్షణ చైనాలోని పెంగ్ రెస్టారెంట్ లో కష్టమర్ల కోసం స్నేక్ సూప్ తయారుచేయడానికి ఓ కోబ్రాని తీసుకొచ్చారు.
ఆ హోటల్ లో పనిచేసే చెఫ్ సూప్ తయారు చేయటానికి కోబ్రాను కట్ చేశాడు. అలా కోబ్రాని మూడు నాలుగు ముక్కలుగా కోబ్రాని కట్ చేసి దని చర్మాన్ని తీసాడు. తలభాగాన్ని పక్కన పెట్టి మిగతా భాగాలతో సూప్ తయారు చేశాడు. ఇదంతా జరగటానికి దాదాపు 20 నిమిషాలు పట్టింది. అప్పటికీ పక్కనే పెట్టిన పాముతల భాగంలో ప్రాణం ఉంది. చెఫ్ దాన్ని గమనించలేదు. సూప్ తయారుచేసేసాక తలభాగాన్ని డస్ట్ బిన్ లో వేద్దామని దాన్ని చేతుల్లోకి తీసుకునే సమయంలో సడెన్ గా ఆ పాముతల ఆచెఫ్ ని కాటు వేసింది..! అంతే కేవలం అరగంటలో చెఫ్ మరణించాడు.
దీంతో రెస్టారెంట్లో పరిస్థితులు మారిపోయాయి. అక్కడ గందరగోళం చూసి కస్టమర్లకు ఏం అర్థం కాలేదు. కానీ ఏదో జరిగి ఉంటుందని అనుకున్నారు. కాసేపు కంగారుపడ్డారు. ఆ తరువాత ఎవరిదారిని వాళ్లు వెళ్లిపోయారు. ఈక్రమంలో చెఫ్ ని బతికించటానికి రెస్టారెంట్ యాజమాన్యం వెంటనే ‘యాంటీ స్నేక్ వీనమ్ ఇంజెక్షన్’ తీసుకురావటానికి ఆఘమేఘాల మీద యత్నించింది. కానీ అంబులెన్స లో వైద్య సిబ్బంది దాన్ని తీసుకురావటానికి ఆలస్యం అయింది.
కోబ్రా విషం అప్పటికే పెంగ్ శరీరంలోకి చేరిపోయింది. దీంతో కేవలం అరగంటలో చెఫ్ మరణించాడు. ఆ రెస్టారెంట్‌కు కోబ్రా సూప్ తాగడానికి వచ్చిన వారంతా పెంగ్ మరణంతో షాక్‌కు గురయ్యారు. కాగా, చనిపోయిన కోబ్రా తల లేచి మనిషిని చంపడంపై అధికారులు స్పందించారు. కోబ్రా చనిపోయిన తర్వాత ఓ అరగంట పాటు తనలోని భాగాలు బతికే ఉంటాయని వెల్లడించారు. అందుకే చెప్ పట్టుకోగానే తలభాగం కాటేసిందని తెలిపారు.
కాగా..పాము కాటు వల్ల ప్రపంచంలో ప్రతి సంవత్సరం 1 మిలియన్లకు పైగా ప్రజలు మరణిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. అలాగే ప్రపంచంలో అత్యంత పెద్ద, పొడవైన విష సర్పాలలో కింగ్ కోబ్రా చాలా చాలా శక్తివంతమైనది.మొదటిది కూడా. ఇది నేల పైన జీవించే అత్యంత విషసర్పం. సాధారణంగా ఇది 18.5 అడుగుల (5.7 మీటర్) పొడవు పెరుగుతుంది. బరువు సుమారుగా 44 పౌండ్లు (8 కిలోలు) ఉంటుంది.
దీని విషము మెదడు మీద అత్యంత ప్రభావం చూపుతుంది. ఇది కాటు వేస్తే మరణించే అవకాశం 75% వరకు ఉంది. ఏనుగు కూడా దీని విషానికి చనిపోతుందట. ఈ కింగ్ కోబ్రో ఆహారంగా ఇతర పాములను, కొండ చిలువల్ని కూడా తినేస్తుంది. కింగ్ కోబ్రోను చూస్తేనే పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఈ పాము మాత్రం చాలా సిగ్గరి అంటారు సరీపృపాల నిపుణులు.
సాధారణంగా మనుషుల కంట పడదట. ఇతర కోబ్రా జాతి పాముల వల్లే ఈ పాము కూడా తన పొడవులో మూడవ వంతు వరకు పడగ ఎత్తగలదు. ఎటాక్ చేయడానికి ఈ పాము పడగ పైకెత్తి పెద్దగా బుస కొడుతుంది. బాగా ఎదిగిన కింగ్ కోబ్రా పడగ పైకెత్తితే ఆరు అడుగుల ఎత్తులో, ఎదురుగా నిలిచిన మనిషి కళ్ళలోకి ఉగ్రంగా చూస్తుంది. దాని రూపుకు..చూపుకే ప్రాణాలు పోతాయంటే అతిశయోక్తికాదు. దటీజ్ కింగ్ కోబ్రో. కోబ్రో కాటుకు గురైతే కేవలం 30 నిమిషాలకే ప్రాణం పోతుంది.