Pak Parlament 1
Imran Khan : పాక్ జాతీయ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సుప్రింకోర్టు ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్ సర్కార్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిపేందుకు జాతీయ అసెంబ్లీ శనివారం ఉధయం 10.30 గంటలకు సమావేశమైంది. ప్రారంభం నుంచి సభలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ మాట్లాడారు.. సుప్రింకోర్టు ఆదేశాలను స్పీకర్ పాటిస్తారని భావిస్తున్నామని, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరపాలని కోరుతున్నామని అన్నారు.
Pakistan politics: నేడు ఇమ్రాన్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం.. ఓటింగ్ ఎలా జరుగుతుందంటే..
స్పీకర్ అసద్ ఖైజర్ మాత్రం పాక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ కుట్ర జరుగుతోందన్న ఆరోపణలపై చర్చిచాల్సిన అవసరం ఉందని అభిప్రాయా పడ్డారు. కానీ ప్రతిపక్ష సభ్యులు అందుకు ససేమీరా అన్నారు. వెంటనే ఓటింగ్ ను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో పీటీఐ నేతలు మాట్లాడుతూ.. విదేశీ కుట్రపై దర్యాప్తు చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలో ప్రతిపక్ష, అధికార పక్ష పార్టీల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 1గంటలకు వాయిదా వేశారు.
Imran Khan: సుప్రీం చేతిలో ఓడిపోయిన ఇమ్రాన్ ప్రభుత్వం
అయితే అవిశ్వాస తీర్మానంపై జరిగిన సభకు ప్రధాని ఇమ్రాన్ హాజరు కాలేదు. ఇమ్రాన్ తో పాటు పలువురు పీటీఐ నేతలు గైర్హాజరయ్యారు. కేవలం 51మంది మాత్రమే పీటీఐ సభ్యులు సభకు వచ్చారు. మరోవైపు సభ వాయిదా పడిన వెంటనే ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. విదేశీ కుట్రపై చర్చకు పట్టుబట్టాలని, తద్వారా సభ వాయిదా పడేలా చూడాలని తమ సభ్యులకు సూచించినట్లు తెలిసింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులందరూ హాజరయ్యారు. ఓటింగ్ జరిగితే ఓటమి ఖాయమని భావిస్తున్న ఇమ్రాన్ ఎలాగైనా ఓటింగ్ ప్రక్రియను వాయిదా పడేలా తమ వ్యూహాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సభలో ఓటింగ్ జరిగితే అంతకంటే ముందే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన రాజీనామాను ప్రకటిస్తారని సమాచారం.