హోటల్స్..రెస్టారెంట్లలో “బఫే నిషేధం”!..లక్షమంది చనిపోతారని హెచ్చరికలు!!

హోటల్స్..రెస్టారెంట్లలో ప్రభుత్వం “బఫే నిషేధం”విధించింది. చైనాలో పుట్టిన ప్రపంచ దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ యూరప్ దేశాలలో హల్ చల్ చేస్తోంది. ఈక్రమంలో స్కాట్ లాండ్ లో కరోనా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఇప్పటికే 23 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కలిసి మెలిసి తిరగవద్దని ఫుడ్ సెంటర్ లలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే స్కాటిష్ హోటళ్ళు మరియు రెస్టారెంట్లపై “బఫే నిషేధం” విధించింది.
దీనిపై మంత్రి మంత్రి నికోలా స్టర్జన్ మాట్లాడుతూ..స్కాట్లాండ్‌లో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోందనీ..దీంతో వైరస్ పెరుగుతున్న రీత్యా పలు నిషేధాలు తప్పనిసరిగా అమలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇటువంటి పరిస్థితులు అనివార్యంగా వస్తుంటాయని దయచేసి ప్రజలంతా సహకరించాలని కోరారు. తాజాగా మరో ఐదు కరోనా రోగులు గుర్తించబడ్డారనీ రాత్రి వారికి పరీక్షలు చేయగా అది నిర్ధారణ అయ్యిందని తెలిపారు.
అందుకే పలు విషయాల్లో నిషేధాలు తప్పనిసరిగా మారాయని..ముఖ్యంగా హోటల్స్..రెస్టారెంట్లలో ‘‘బఫే’’లను నిషేధించామని గుంపులు గుంపులుగా ప్రజలు నిలబడి తినటం వలన కరోనా వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నట్లుగా మీ దృష్టికి వస్తే..ఎవరికైనా అటువంటి లక్షణాలు ఉంటే దయచేసి తెలియజేయాలని కోరారు మంత్రి నికోలా స్టర్జన్.
కరోనాతో కోటిమంది చనిపోతారని పరిశోధకుల హెచ్చరికలు
కాగా..ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కోటిన్నర మందిని బలి తీసుకోనుందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ అధ్యయనం హెచ్చరించింది. ఒకవేళ పరిస్థితి ఊహించిన దానికన్నా దారుణంగా ఉంటే మాత్రం.. 6.8 కోట్ల మంది మృత్యువాత పడొచ్చని అధ్యయనంలో తెలిపింది. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. చైనాతో పాటు భారత్ లో లక్షల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోవచ్చని అంచాన వేశారు. ఇక అమెరికాలో 2లక్షల 30వేల మంది, బ్రిటన్ లో 64వేల నుంచి లక్ష మంది వరకూ చనిపోవచ్చని.. జర్మనీలో79వేల మంది, ఫ్రాన్స్ లో 60వేల మంది చనిపోతారని పరిశోధకులు అంచనా వేశారు. బ్రిటన్ జీడీపీ 1.5శాతం, అమెరికా జీడీపీ 2శాతం తగ్గనుందన్నారు. దీంతో యూకే దేశాల్లో ఒకటైన స్కాట్లాండ్ మంత్రులు ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. కరోనా వ్యాపించకుండా పటిష్ట చర్యలు తీసుకోవటంతో పాటు ప్రజలపై పలు ఆంక్షలు విధిస్తోంది. ఇదంతా ప్రజలకోసమేనని ప్రజలకు తెలియజేస్తోంది.
లక్షమందికి కరోనా..
కాగా.. ప్రపంచాన్ని కమ్మేస్తున్న కరోనా బారిన పడ్డ వారి సంఖ్య లక్ష దాటింది. 92 దేశాలకుపైగా విస్తరించింది. ఇప్పటిదాకా- 1,00, 842 మందికి కరోనా సోకినట్లు ఏఎఫ్ పీ వార్తాసంస్థ ప్రకటించిన క్రమంలో స్కాట్ ల్యాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.ఈ క ్రమంలో పలు ఆంక్షలు విధిస్తోంది.
See Also | CM కమల్‌నాథ్‌కు పదవీ గండం..ప్రభుత్వం ఏర్పాట్లుకు బీజేపీ వ్యూహాలు: ఎంపీలో ఏం జరుగుతోంది?!