షాకింగ్ న్యూస్ : బూట్లపై కరోనా వైరస్ ఎంతకాలం బతికుంటుందంటే?

  • Published By: madhu ,Published On : March 28, 2020 / 05:41 AM IST
షాకింగ్ న్యూస్ : బూట్లపై కరోనా వైరస్ ఎంతకాలం బతికుంటుందంటే?

Updated On : March 28, 2020 / 5:41 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకొనేందుకు దారులు వెతుకుతున్నారు. ఇతరుల నుంచి వేగంగా వ్యాపిస్తుండడంతో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. వైరస్ ఎలా సోకుతుంది ? ఎలా వ్యాపిస్తుంది ? తదితర వివరాలు తెలుసుకొనేందుకు తెగ వెతుకుతున్నారు. నిపుణులు కూడా పలు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. తాజాగా ధరించే బూట్లపై కరోనా వైరస్ 5 రోజుల పాటు జీవించగలదని హెచ్చరిస్తున్నారు.

సూక్ష్మక్రిములకు ప్రధాన బిందువుగా ఉంటుందంటున్నారు. ఈ వైరస్ రబ్బర్, తోలు వాటిపై వైరస్ ఐదు రోజుల కంటే ఎక్కువగానే ఉంటుందని మేరీ ఇ. స్మిత్ హెచ్చరించారు. దీనిని యూకే హఫింగ్టన్ పోస్టు వెల్లడించింది. బూట్లను తయారు చేయడానికి వివిధ వస్తువులు వాడుతుంటారనే సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ పై రెండు లేదా మూడు రోజుల పాటు వైరస్ జీవించగలదని అంటున్నారు. అంటే…ప్లాస్టిక్ భాగాలు కలిగి ఉన్న బూట్లు ధరించడం ప్రమాదకరమేనని చెబుతున్నారు. 

షూ లోపలి భాగం కంటే..పై భాగంలోనే బ్యాక్టరీయా ఉంటుందని, వైరస్ పెరుగుతుందని వైద్యుడు క్వాన్జా పింక్నీ వెల్లడించారు. 2008లో అరిజోనా విశ్వవిద్యాలయంని మైక్రో బయాలజిస్టులు ఓ అధ్యయనం జరిపింది. షూలో 4 లక్షల 21 వేల బ్యాక్టీరియా, వైరస్, పరాన్న జీవులు ఉంటాయని అధ్యయనం వెల్లడించింది. రోగ నిరోధకశక్తి పెరగకుండా ఇవి పనిచేస్తాయని వైద్యుడు తెలిపారు. 

ఇంట్లో ప్రవేశించేముందు ధరించిన షూస్ తీయడం చాలా మంచిదని స్పెషలిస్టు కరోల్ వెల్లడించారు. ఇంటి ద్వారం వద్ద కాకుండా..కొద్దిగా దూరంగానే వదిలివేస్తే మంచిదని అన్నారు. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, తగిన జాగ్రత్తలు చెప్పాలని సూచించారు. పిల్లలు ముట్టుకోకుండా దూరంగా ఉంచాలని, బూట్లను తాకవద్దని వారికి చెప్పాలన్నారు. మరి ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రంగా ఉండాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. కానీ కరోనా వైరస్ బూట్ల నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు కొంతమంది.