కరోనా నియంత్రణకు వరల్డ్ బ్యాంక్ రూ.88వేల కోట్ల సహాయం

  • Published By: veegamteam ,Published On : March 4, 2020 / 04:07 AM IST
కరోనా నియంత్రణకు వరల్డ్ బ్యాంక్ రూ.88వేల కోట్ల సహాయం

Updated On : March 4, 2020 / 4:07 AM IST

కరోనా వైరస్ ను నియంత్రించటానికి వరల్డ్ బ్యాంక్  12 బిలియ‌న్ల డాల‌ర్లు ( రూ.88వేల కోట్ల)సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను నియంత్రించేందుకు ఆయా దేశాలు నానా తిప్పలు పడుతున్నాయి. ప్రాణాంత‌కంగా మారిన కరోనా వైర‌స్‌ను అదుపు చేసేందుకు అన్ని దేశాలు న‌డుం బిగించాయి. క‌రోనాపై పోరాటానికి సిద్దపడ్డాయి. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై తీవ్రంగా పడింది. దీంతో అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం తలెత్తింది. దేశాలను కరోనా మాంద్యంలోకి నెట్టేసే పరిస్థితి వస్తుందని ప్రపంచ దేశాల నాయకులు అభిప్రాయపడ్డారు. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు నడుం బిగించాయి. 

ఈ క్రమంలో  చేస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాల‌కు .. వర‌ల్డ్ బ్యాంక్ సుమారు 12 బిలియ‌న్ల డాల‌ర్లు సాయం అందించేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేసింది.  ఎమ‌ర్జెన్సీ ప్యాకేజీ త‌ర‌హాలో వ‌ర‌ల్డ్ బ్యాంక్ ఆయా దేశాల‌కు ఆ డ‌బ్బును ఖ‌ర్చు చేయ‌నుంది.  త‌క్కువ వ‌డ్డీతో రుణాలు, గ్రాంట్లు, టెక్నిక‌ల్ స‌హ‌కారం అందించేందుకు కూడా వ‌ర‌ల్డ్ బ్యాంక్ రెడీ అయ్యింది. క‌రోనా వ్యాప్తితో అనేక దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలిన విషయం తెలిసిందే. దీంతో ఆయా దేశాల నాయకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  (ప్రతి వందేళ్లకోసారి మానవాళిని చంపేస్తున్న మహమ్మారి.. ఇప్పుడు కరోనా వంతు వచ్చిందా..)

ఈ స‌మ‌స్య నుంచి గ‌ట్టెక్కేందుకు వ‌ర‌ల్డ్ బ్యాంక్ భారీ రుణ సాయానికి సిద్ద‌మైంది.  తాము ఇచ్చే నిధుల‌తో అభివృద్ధి చెందుతున్న దేశాలు.. ప‌బ్లిక్ హెల్త్ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయాల‌ని వ‌ర‌ల్డ్ బ్యాంక్ పేర్కొన్న‌ది.  అత్యంత‌పేద దేశాల‌ను ఎంపిక చేసి.. నిధుల‌ను చేర‌వేస్తామ‌ని వ‌ర‌ల్డ్ బ్యాంక్ చెప్పింది.