బీ అలర్ట్: మాస్కులు, గ్లోవ్స్ వేసుకుంటే సరిపోదు..

కరోనా వైరస్ ధరిచేరకుండా మాస్క్‌లు, గ్లోవ్స్‌ను వాడుతున్నా, వాటివల్ల వైరస్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మీకు తెలుసా? అవును ఇది నిజం. అందరూ జాగ్రత్తగా మాస్కులు వాడతున్నారు, గ్లొవ్స్ వేసుకుంటున్నారు. అవి కూడా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్‌లు, గ్లోవ్స్‌లను కరక్ట్‌గా వాడకపోతే ఇన్‌ఫెక్షన్‌లు మరింత వేగంగా విస్తరిస్తాయని తెలిపారు.
ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలి, ముఖాన్ని పదేపదే తాకరాదు. ఒకవేళ జ్వరం, దగ్గు వచ్చిందా మాస్క్ కచ్చింతంగా ధరించాలి, అందరికీ దూరంగా ఒంటరిగా ఉండాలని WHO సూచిస్తోంది. ప్రతి ఒక్కరూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రతను పాటించడంతో పాటు చేతులతో ముఖాన్ని తాకరాదని డైరెక్టర్ మైక్ ర్యాన్ ప్రజలకు సూచించారు. (విదేశాల నుంచి వచ్చిన వారు ఇంట్లో నుంచి బయటికి వస్తే చర్యలు – ఏపీ సర్కార్)
ఇక మాస్క్‌లు ధరించే ముందు తమ చేతులను శుభ్రంగా కడుక్కోవాలనే విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రతిసారి చేతితో వాటిని సరిచేసుకుంటున్నారని ఫ్రాన్స్ హెల్త్ చీఫ్ జిరోమ్ సాల్మన్ అంటున్నారు. ప్రజలు తమ ముఖాన్ని తరచూ తాకడం మానుకోకపోతే వైరస్ నుంచి గ్లోవ్స్, మాస్కులు మిమ్మల్ని రక్షించవని అన్నారు. చర్మాన్ని తాకడం, చెవులు, కళ్లు, ముక్కు ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని.. అందుకే చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నది జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ కార్యదర్శి అమేజ్ అదల్జ సూచన .