కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే..మొసళ్లలా మారిపోవచ్చు, ఆడవారికి గడ్డం మొలవచ్చు

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే..మొసళ్లలా మారిపోవచ్చు, ఆడవారికి గడ్డం మొలవచ్చు

Updated On : December 19, 2020 / 2:33 PM IST

COVID-19 Vaccine Can Turn People Into “Crocodiles” : కోవిడ్ వ్యాక్సిన్‌పై బ్రెజిల్ దేశాధ్యక్షుడు జెయిర్ బొల్సనారో (Jair Bolsonaro) సంచలన కామెంట్స్ చేశారు. వ్యాక్సిన్ తీసుకుంటే..మొసళ్లలా మారిపోవచ్చని, ఆడవాళ్లకు గడ్డం మొలిచే అవకాశాలున్నాయంటూ విచిత్ర వ్యాఖ్యలు చేశారాయన. ఈ చేసిన కామెంట్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌‌కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పలు దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీకి శ్రీకారం చుడుతున్న క్రమంలో..బ్రెజిల్ దేశాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమౌతున్నాయి.

కోవిడ్ టీకా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఆయన..ఫైజన్ బయో ఎన్ టెక్ టీకా (Pfizer-BioNTech) ను తీసుకంటే..మనుషులు మొసళ్లలా మారే అవకాశాలున్నాయన్నారు. తాను మాత్రం కరోనా టీకా వేసుకొనేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ఒకవేళ మొసళ్లలా మారితే..అది మీ సమస్య అవుతుందని సెటైర్ వేశారు. సూపర్ హూమన్‌గా మారితే..అప్పుడు మహిళలకు గడ్డం మొలిచినా ఆశ్చర్యం లేదంటూ వ్యాఖ్యానించారు.

అంతేగాదు..మగవారు..ఆడ గొంతుతో మాట్లాడే వీలు ఉందని, సైడ్ ఎఫెక్ట్‌తో ఆ కంపెనీకి సంబంధం లేదని చెప్పారు. టీకాను తాము ఫ్రీగానే ఇవ్వబోతున్నామని, టీకా మాత్రం తప్పనిసరి కాదన్నారు. ఇక బ్రెజిల్‌లో కరోనా విషయానికి వస్తే…ఇప్పటి వరకు 70 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షా 85 వేల మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.