Srilanka Bus Crashes : లోయలో పడ్డ బస్సు.. 14 మంది మృతి, 30మందికి తీవ్ర గాయాలు

Crowded Bus Crashes Into Precipice In Sri Lanka Kills 1430 Injuries
Bus Crashes 14 People Kills : శ్రీలంక రాజధాని కొలంబోలో ఘోరం జరిగింది. నిండుగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోవటంతో ఏకంగా..దీంతో 14మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొండ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించడానికి ప్రయత్నించగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. కొలంబోకు తూర్పున 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసరా పట్టణానికి సమీపంలో ఉన్న ప్రిసిపైస్ గ్రామంలో ఈ ఘోర విషాదం సంభవించింది.
70 మంది ప్రయాణికులతో శనివారం (మార్చి 20,2021) బస్సు బయల్దేరింది. అయితే కొండ ప్రాంతమైన మొనెరగులా-బదుల్లా రోడ్డు మార్గం చాలా ప్రమాదకరం. ఈ ఇరుకు మార్గంలో ఒకేసారి బస్సు, ట్రక్కు ఎదురెదురుగా వచ్చాయి. ఈక్రమంలో మలుపు ప్రాంతంలో ట్రక్కును తప్పించబోయిన బస్సు కొంచెం పక్కకు జరగడంతో బరువుకు పక్కకు ఒరిగిపోయి పక్కనే లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు 14మంది దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంపై సమాచారం అందించిన వెంటనే అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొద్దిమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
గాయాలు తీవ్రంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అయితే ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీస్ అధికారి అజిత్ రోహన తెలిపారు. ఈ రోడ్డు వెంట తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని స్థానికులు చెప్పారు. 16 ఏళ్లల్లో ఇదే అతి పెద్ద ప్రమాదమని అధికారులు గుర్తించారు.